ఆర్ఆర్అర్ హీరో, గ్లోబల్ స్టార్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తున్నారు. శంకర్ తెరకెక్కిస్తోన్న ఈ మూవీలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్‌గా కనిపించనుంది. ఆర్ఆర్ఆర్ తర్వాత చెర్రీ నటిస్తున్న మూవీ కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదిలా ఉండగా .. హీరో రామ్ చరణ్‌కు అంతర్జాతీయ స్థాయిలో మరో అరుదైన గుర్తింపు దక్కింది. అమెరికాలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే 2023 పాప్ గోల్డెన్ అవార్డ్స్‌లో గోల్డెన్ బాలీవుడ్ యాక్టర్‌గా నిలిచారు. ఈ విషయాన్ని పాప్ గోల్డెన్ కమిటీ అధికారికంగా వెల్లడించింది.
ఈ అవార్డ్ కోసం నామినేట్ అయినవారిలో సినీ ప్రముఖులు షారుఖ్ ఖాన్, దీపికా పదుకొణె, అదా శర్మ, విషెస్ బన్సల్, అర్జున్ మాథుర్, రిద్ధి డోగ్రా, రాశీ ఖన్నా కూడా ఉన్నారు. కాగా.. ఇటీవలే రామ్ చరణ్ ‘ది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్’ (ఆస్కార్) క్లాస్ ఆఫ్ యాక్టర్స్ జాబితాలో చోటు దక్కించుకున్నారు. తాజాగా ‘గోల్డెన్ బాలీవుడ్ అవార్డు’ కి ఎంపికవడంతో ఆయన అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.
(ఇది చదవండి: బిగ్‌బాస్ 7: ఎలిమినేషన్ రౌండ్.. శివాజీ వర్సెస్ శోభా! చివరకు..)
ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న రామ్ చరణ్ ఆస్తులపై నెట్టింట చర్చ జరుగుతోంది. మెగాస్టార్ తనయుడిగా ఎంట్రీ ఇచ్చి తనకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ‘గోల్డెన్ బాలీవుడ్ అవార్డు గెలిచిన సందర్భంగా చెర్రీ ఆస్తుల గురించి నెటిజన్స్ ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం ఆయనకు ఉన్న ఆస్తుల విలువ ఎంత? నెలకు ఎంత సంపాదిస్తున్నారన్న విషయాలపై ఓ లుక్కేద్దాం.
ఈ ఏడాది ఓ నివేదిక వెల్లడించిన ప్రకారం.. రామ్ చరణ్‌కు దాదాపు రూ.1370 కోట్ల ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్‌కు ముందు ఒక్కో సినిమాకు రూ.15 కోట్ల పారితోషికం తీసుకునేవారు. రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రానికి దాదాపు రూ.45 కోట్ల పారితోషికం అందుకున్నారు. సినిమాలతో పాటు వాణిజ్య ప్రకటనల ద్వారా భారీగానే ఆర్జిస్తున్నారు. ఒక్కో ప్రకటనకు దాదాపుగా రూ.2 కోట్ల వరకు ఛార్జ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. చెర్రీ ఇప్పటివరకు దాదాపు 34 ప్రముఖ బ్రాండ్ల ప్రకటనల్లో కనిపించారు. ప్రస్తుతం నెలకు కేవలం ప్రకటనల ద్వారా రూ.3 కోట్లు సంపాదిస్తున్నట్లు సమాచారం.
జూబ్లీహిల్స్‌లో విలాసవంతమైన ఇల్లు
రామ్‌చరణ్‌కు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో దాదాపు 25 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో విలావసవంతమైన ఇల్లు ఉంది. ఆ ఇంట్లో స్విమ్మింగ్ పూల్, జిమ్, టెన్నిస్ కోర్ట్ లాంటి ఆధునాతన సౌకర్యాలున్నాయి. ఆ ఇంటి విలువు దాదాపు రూ.38 కోట్లుగా ఉంటుందని అంచనా. అంతే కాకుండా రామ్ చరణ్‌కు ముంబయిలోనూ ఖరీదైన పెంట్ హౌస్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
(ఇది చదవండి: రామ్‌చరణ్‌కి గోల్డెన్ బాలీవుడ్ యాక్టర్ అవార్డు)
ఖరీదైన కార్లు, బిజినెస్
గ్లోబల్ స్టార్ గ్యారేజీలో రేంజ్‌కు తగ్గట్టుగానే లగ్జరీ కార్లు ఉన్నాయి. దాదాపు రూ.4 కోట్ల విలువైన మెర్సిడెజ్‌తో పాటు ఆడి మార్టిన్, రోల్స్ రాయిస్, రేంజ్ రోవర్., పెరారీ లాంటి ఖరీదైన కార్లు ఉన్నాయి. అంతే కాకుండా కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ పేరుతో చిత్ర నిర్మాణ సంస్థను కూడా నడిపిస్తున్నారు. ఈ బ్యానర్‌లో ఖైదీ నెం.150 మూవీని తెరకెక్కించారు. వీటితో పాటు రామ్ చరణ్‌కు ట్రూజెట్ అనే ఎయిర్‌లైన్ సంస్థను నడుపుతున్నారు. ఇలా అన్ని విధాలుగా ఆస్తులు, వ్యాపారం కలిపితే రామ్ చరణ్ ఆస్తులు రూ.1370 కోట్లకు పైగానే ఉన్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment