ఎస్వీబీసీ ఉద్యోగి సూసైట్‌ నోట్‌ కలకలం | SVBC Employee Missing After Write A Suicide Note | Sakshi
Sakshi News home page

ఎస్వీబీసీ ఉద్యోగి సూసైట్‌ నోట్‌ కలకలం

Published Wed, Jun 19 2019 5:15 PM | Last Updated on Wed, Jun 19 2019 5:18 PM

SVBC Employee Missing After Write A Suicide Note - Sakshi

సాక్షి, తిరుపతి : టీటీడీకి చెందిన ఎస్వీబీసీ ఉద్యోగి నిరంజన్‌ ప్రసాద్‌ రాసిన సూసైడ్‌ నోట్‌ కలకలం రేపుతోంది. తన ఆత్మహత్యకు సహచర ఉద్యోగి వరదరాజులు వేధింపులే కారణమని ఆ లేఖలో పేర్కొన్న నిరంజన్‌ ఇంటి నుంచి కనిపించకుండా వెళ్లిపోయారు. సాక్షాత్తూ శ్రీవారి సన్నిధిలో ఉన్న ఎస్వీబీసీ ప్రధాన కార్యాలయాన్ని అడ్డగా మార్చుకుని వరదరాజులు అక్రమ చిట్టి దందా కొనసాగిస్తున్నారని నిరంజన్‌ ఆరోపించారు. తాను వరదరాజుల చేతిలో మోసపోయాయని.. అతని వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటునానని నిరంజన్‌ లేఖలో చెప్పారు. అయితే ప్రస్తుతం నిరంజన్‌ ఎక్కడ ఉన్నాడనే విషయం తెలియడం లేదు. అతను ఆత్మహత్య చేసుకున్నాడా లేక ఎక్కడికైనా వెళ్లిపోయాడా అన్న విషయం తెలియాల్సి ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement