employee missing
-
ఎస్వీబీసీ ఉద్యోగి సూసైట్ నోట్ కలకలం
సాక్షి, తిరుపతి : టీటీడీకి చెందిన ఎస్వీబీసీ ఉద్యోగి నిరంజన్ ప్రసాద్ రాసిన సూసైడ్ నోట్ కలకలం రేపుతోంది. తన ఆత్మహత్యకు సహచర ఉద్యోగి వరదరాజులు వేధింపులే కారణమని ఆ లేఖలో పేర్కొన్న నిరంజన్ ఇంటి నుంచి కనిపించకుండా వెళ్లిపోయారు. సాక్షాత్తూ శ్రీవారి సన్నిధిలో ఉన్న ఎస్వీబీసీ ప్రధాన కార్యాలయాన్ని అడ్డగా మార్చుకుని వరదరాజులు అక్రమ చిట్టి దందా కొనసాగిస్తున్నారని నిరంజన్ ఆరోపించారు. తాను వరదరాజుల చేతిలో మోసపోయాయని.. అతని వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటునానని నిరంజన్ లేఖలో చెప్పారు. అయితే ప్రస్తుతం నిరంజన్ ఎక్కడ ఉన్నాడనే విషయం తెలియడం లేదు. అతను ఆత్మహత్య చేసుకున్నాడా లేక ఎక్కడికైనా వెళ్లిపోయాడా అన్న విషయం తెలియాల్సి ఉంది. -
ఇంటర్వ్యూకని వెళ్లి వివాహిత అదృశ్యం
సికింద్రాబాద్: ఇంటర్వ్యూకు హాజరయ్యేందుకు బయలుదేరి వెళ్లిన వివాహిత కనిపించకుండా పోయింది. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన గోపాలపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. హెడ్‌కానిస్టేబుల్ ఎస్.శ్రీరాములు కథనం ప్రకారం.. మల్కాజిగిరి మిర్జాల్‌గూడలో నివాసం ఉంటు ప్రైవేటు ఉద్యోగి జేమ్స్‌తో అదే ప్రాంతానికి చెందిన ఆరోఖ్యమేరి (25)కు ఐదేళ్ల క్రితం వివాహమైంది. కాస్మోటిక్ విభాగంలో డిప్లమా చేసిన ఆరోఖ్యమేరీ గతంలో పలు చోట్ల ఉద్యోగాలు చేసింది. కొద్ది నెలలుగా ఖాళీగా ఉంటున్న ఆమె హైటెక్ సిటీలోని ఒక కంపెనీలో జాబ్ ఇంటర్వ్యూకు హాజరయ్యేందుకు ఈనెల 30న బయలుదేరింది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు తీసుకువచ్చిన భర్త జేమ్స్ ఆమెను కొండాపూర్ బస్సు ఎక్కించాడు. ఆరోజు నుంచి ఆరోఖ్యమేరీ సెల్ స్విచ్ ఆఫ్ ఉండగా, ఇంటికి తిరిగి రాలేదు. పలుచోట్ల గాలించిన భర్త గోపాలపురం పోలీసులను ఆశ్రయించాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.