
సాక్షి, తిరుపతి : శ్రీ వెంకటేశ్వర భక్తి చానెల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో) నియామకానికి గురువారం నోటిఫికేషన్ జారీ అయింది. మూడేళ్ల కాలపరిమితితో సీఈవోను నియమించనున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు మే 29వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి. అర్హత నిబంధనలు, నిర్ణీత దరఖాస్తు ఫారాన్ని ‘www.svbcttd.com’ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఎస్వీబీసీ ప్రస్తుత సీఈవో నగేష్‌కు గత ఏడాది జూన్ నెలాఖరుకే పదవీ కాలం ముగిసినా, ఆయన అభ్యర్థన మేరకు టీటీడీ పాలక మండలి ఇప్పటి దాకా పొడిగించింది. తాజాగా సీఈవో పోస్ట్ భర్తీకి ఎస్వీబీసీ మేనేజింగ్ డైరెక్టర్ హోదాలో టీటీడీ అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి చర్యలు తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment