
పృథ్వీ
థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ...అంటూ తనదైన టైమింగ్‌తో ప్రేక్షకులను నవ్విస్తోన్న పృథ్వీ హీరోగా రూపొందిన చిత్రం ‘మైడియర్ మార్తాండం’. హరీష్ కె.వి దర్శకత్వంలో మేజిన్ మూవీ మేకర్స్ పతాకంపై సయ్యద్ నిజాముద్దీన్ నిర్మించారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేశారు. నిర్మాత సయ్యద్ మాట్లాడుతూ– ‘‘హాస్యనటుడిగా గుర్తింపు తెచ్చుకున్న పృథ్వీ టైటిల్ పాత్రలో నటించారు.
ముఫ్పై రోజుల్లో లాయర్ అవ్వడం ఎలా? అనే డిఫెన్స్ లాయర్ పాత్రలో పృథ్వీగారి నటన సినిమాకే హైలైట్. క్రైమ్ కామెడీగా కోర్ట్ రూమ్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది. త్వరలోనే టీజర్ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. మరి.. మార్తాండం ఇక్కడ అంటూ ఈ సినిమాలో సిల్వర్ స్క్రీన్‌పై పృథ్వీ ఎలా రెచ్చిపోతారో చూడాలి. జయ ప్రకాశ్‌రెడ్డి, కృష్ణ భగవాన్, రాకేందు మౌళి, గోకుల్ తదితరులు నటించిన ఈ సినిమాకు పవన్ సంగీతం అందించారు.
Comments
Please login to add a commentAdd a comment