భద్రాద్రి: గిరిజన యువతి పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలో చోటుచేసుకుంది. సీఐ అశోక్ కథనం ప్రకారం.. ఉంజుపల్లికి చెందిన పాయం భూదేవి భర్త మరణానంతరం చర్లలోని గొల్లగట్టలో నివాసముంటోంది. ఆమె రెండో కుమార్తె పాయం ఆకాంక్ష (21) హైదరాబాద్‌లో బీటెక్ ఫైనలియర్ చదువుతోంది.
కాగా, చర్లకు చెందిన దొడ్డా పృథ్వీరాజు, ఆకాంక్ష కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పృథ్వీరాజ్ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసేందుకు హైదరాబాద్‌కు వెళ్లాడు. తిరిగి రాగానే ఆకాంక్ష, పృథ్వీరాజు కలిసి చర్లలో ఇంటిని అద్దెకు తీసుకొని కాపురం పెట్టారు. కాగా, పాయం భూదేవి నెల రోజుల కిందట వారి వద్దకు వెళ్లి ఆకాంక్షను ఇంటికి రావాలని కోరినా ఆమె నిరాకరించింది. శనివారం సాయంత్రం పృథ్వీరాజు ఇంట్లో లేని సమయంలో ఆకాంక్ష కలుపుమందు తాగింది.
దీంతో పృథ్వీరాజుతో పాటు అతడి తల్లిదండ్రులు ఆమెను భద్రాచలంలోని ఓ ప్రైవేట్ వైద్యశాలకు తరలించి చికిత్స నిర్వహిస్తుండగా మృతి చెందింది. అయితే, చికిత్స పొందుతున్న సమయంలో తన కుమార్తెతో తాను మాట్లాడానని, భర్త, అత్తమామలు వేధిస్తున్నారని, అందువల్లే కలుపుమందు తాగానని చెప్పినట్లు తల్లి భూదేవి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. సీఐ అశోక్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఆకాంక్ష మృతదేహానికి పృథ్వీరాజు కుటుంబ సభ్యులే అంత్యక్రియలు నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment