
టాలీవుడ్, కోలీవుడ్‌ల్లో టాప్ హీరోయిన్లలో ఒకరు కీర్తీ సురేశ్. ఈ భామ రెండు ఇండస్ట్రీల్లో టాప్ స్టార్స్‌తో నటిస్తూ బీజీగా మారిపోయింది. తెలుగులో ప్రస్తుతం మహేశ్ బాబు హీరోగా పరశురాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సర్కారు వారి పాట’ చిత్రంలో నటిస్తోంది. అయితే తాజాగా ఈ బ్యూటీ తన తల్లి మేనకా సురేశ్ గురించి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కీర్తిసురేశ్ తల్లి మేనకా సైతం ఒకప్పటి హీరోయినే. పెళ్లి తర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చిన ఈ సినీయర్ నటి 2005 నుంచి వరుసగా మూవీస్‌లో నటిస్తోంది. కాగా ఆమె తాజాగా చేయనున్న మలయాళీ సినిమా ‘భ్రమమ్’. ఈ సినిమాకి సంబంధించిన తల్లి పోస్టర్‌ని ప్రైమ్ వీడియోలో చూస్తున్న తన పిక్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. దానికి.. ‘అమ్మ భ్రమమ్‌ని ఎలా ముగిస్తావు?’ అని రాసుకొచ్చింది. అంతేకాకుండా ‘నేను చూస్తున్నది నిజమేనా..?’ అని అడుగుతూ మాలయాళ నటుడు పృథ్విరాజ్ సుకుమారన్‌ని ట్యాగ్ చేసింది.
కాగా ‘భ్రమమ్’ బాలీవుడ్ మూవీ ‘అంధాధున్’కి రీమేక్‌గా వస్తోంది. ఇందులో పృథ్విరాజ్, రాశిఖన్నా జంటగా నటిస్తున్నారు. అక్టోబర్ 7న ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రీమియర్ కానుంది. సోషల్ మీడియా పోస్ట్‌తో ఈ సినిమాలో మేనకా ముఖ్య పాత్రలో నటిస్తున్నట్లు కీర్తీ హింట్ ఇచ్చినట్లు ఉందని ఫీల్మీ దునియాలో చర్చించుకుంటున్నారు. కాగా ఈ బాలీవుడ్ మూవీనే ఇటీవల హీరో నితిన్ ‘మ్యాస్ట్రో’గా తెలుగులో రీమేక్ చేసి, ఓటీటీలో విడుదల చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment