![Kris Venugopal wife Divya Sreedhar about Divorce Rumours](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/12/Kris-Venugopal.jpg.webp?itok=VUAA8LTo)
మనవళ్లతో ఆడుకునే సమయంలో పెళ్లి చేసుకోవడమేంటో.. ఇంతకీ కలిసున్నారా? మొదటి పెళ్లిలాగే ఇది కూడా ముక్కలైందా? అంటూ మలయాళ నటుడు క్రిస్ వేణుగోపాల్ (Kris Venugopal)పై బోలెడన్ని విమర్శలు వచ్చాయి. అతడు మూడుముళ్లు వేసిన నటి దివ్య శ్రీధర్ (Divya Sreedhar)పైనా ట్రోలింగ్ జరిగింది. ఆస్తి కోసమే ఈ పెళ్లి చేసుకుంది కాబోలంటూ పలువురూ ఆమెను తిట్టిపోశారు. ఆ విమర్శలను తిప్పికొడుతూ ఇద్దరూ కొత్త జీవితం ప్రారంభించారు.
ఎవరి జీవితాల్లోకి తొంగి చూడట్లేదు
గతేడాది నవంబర్‌లో వేదమంత్రాల సాక్షిగా ఒక్కటయ్యారు. మొన్నటిదాకా ముసలాడికి పెళ్లేంటన్న జనాలు ఇప్పుడు ఇద్దరూ విడిపోయారంటూ ప్రచారం మొదలుపెట్టారు. తాజాగా ఈ రూమర్లపై దివ్య శ్రీధర్ స్పందించింది. ఓ వీడియో రిలీజ్ చేసింది. 'మేము ఎవరి జీవితాల్లోకి తొంగిచూడట్లేదు. ఎవరికీ ఏ హానీ తలపెట్టలేదు. మరెందుకు మా జీవితాల గురించి ఇష్టారీతిన రాస్తున్నారు. ఎవరికి నచ్చినట్లు వారు ఏవేవో కథలు అల్లేసుకుంటున్నారు.
![](https://www.sakshi.com/s3fs-public/inline-images/krisvenugoapl.jpg)
విడాకులు తీసుకుంటున్నట్లు ప్రచారం..
మా జంట మీకు నచ్చకపోతే మమ్మల్ని వదిలేయండి. చెత్త కామెంట్లు మాత్రం పెట్టకండి. మమ్మల్ని ప్రేమిస్తున్నవారందరికీ థాంక్యూ. ఇప్పుడీ వీడియో చేయడానికి ప్రధాన కారణం.. నా భర్త నాకోసం లిప్‌స్టిక్, చాక్లెట్స్ వంటి కొన్ని బహుమతులు పంపించాడు. ప్రేమికుల రోజు ఈ వారంలోనే వస్తుండటంతో మా ఆయన ఎన్నో బహుమతులిస్తున్నాడు. అవన్నీ మీకు చూపించాలని, నా సంతోషాన్ని మీతో పంచుకోవాలని అనుకున్నాను. కానీ మేము విడాకులు తీసుకుంటున్నట్లు ప్రచారం మొదలుపెట్టారు.
బహుమతులు చూపించాలనుకున్నా..
అది చూసి చాలా బాధేసింది. మేము కలిసే ఉన్నాం.. నా జీవితంలో ఇంత ప్రేమ నేనెప్పుడూ పొందలేదు. చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి జ్ఞాపకాలు కూడబెట్టుకుంటున్నప్పుడు అన్నింటినీ మైమరిచిపోతున్నాను' అని చెప్పుకొచ్చింది. క్రిస్ వేణుగోపాల్, దివ్య శ్రీధర్ పాతరమట్టు సీరియల్‌లో కలిసి నటించారు. గతేడాది ఇద్దరూ రెండో పెళ్లి చేసుకున్నారు. పలు సీరియల్స్‌లో యాక్ట్ చేసిన వేణుగోపాల్ పల్లు రైజింగ్, తెలివు, సంబవస్తలతు నిన్నుమ్ వంటి చిత్రాల్లోనూ నటించాడు. దివ్య శ్రీధర్ సీరియల్స్‌లో విలనిజం పండించే పాత్రలు పోషిస్తూ ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment