అభిమాని అత్యుత్సాహం.. కోపంతో ఫోన్‌ లాక్కున్న హీరో | Unni Mukundan Loses Cool And Snatches Fan Phone For Filming Him Too Close, Video Goes Viral | Sakshi
Sakshi News home page

Unni Mukundan: అభిమాని ఫోన్‌ లాక్కుని వెళ్లిపోయిన హీరో.. వీడియో వైరల్‌

Published Mon, Feb 24 2025 2:43 PM | Last Updated on Mon, Feb 24 2025 4:18 PM

Unni Mukundan Snatches fan Phone for Filming Him, Video Goes Viral

మార్కో సినిమాతో బాక్సాఫీస్‌ విధ్వంసం సృష్టించాడు ఉన్ని ముకుందన్‌ (Unni Mukundan). ఈ మూవీలో యాక్షన్‌ హీరోగా రక్తపాతాన్ని పారించిన ఆయన నిర్మాతలకు కాసుల వర్షం కురిపించాడు. ఇటీవల ఆయన ప్రధాన పాత్రలో నటించిన గెట్‌ సెట్‌ బేబీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఓ మల్టీప్లెక్స్‌కు వెళ్లాడు హీరో. అతడిని చూసిన ఓ అభిమాని హీరోకు దగ్గరగా వెళ్లాడు. ఉన్ని ముకుందన్‌ నడుస్తూ ఉంటే అతడిని వెంబడిస్తూ ఫోన్‌లో వీడియో చిత్రీకరించాడు.

ఫోన్‌ లాక్కున్న హీరో
అది చూసి సహనం నశించిన హీరో సదరు అభిమాని దగ్గరి నుంచి ఫోన్‌ లాక్కున్నాడు. దాన్ని జేబులో పెట్టుకుని కోపంతో అలాగే ముందుకు నడుచుకుంటూ వెళ్లిపోయాడు. అభిమాని బతిమాలడంతో ఫోన్‌ వెనక్కిచ్చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇది చూసిన అభిమానులు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

ఇంకా నయం.. ఫోన్‌ తీసుకెళ్లిపోలేదులే
మీరు హీరోగా ఎదిగే సమయంలో ఎవరైనా మీ అభిమాని అని మీ దగ్గరకు వస్తే సంతోషపడతారు. ఇలా స్టార్‌డమ్‌ వచ్చాక మాత్రం ఇరిటేట్‌ అవుతుంటారు అని ఓ వ్యక్తి రాసుకొచ్చాడు. మరికొందరేమో.. హీరోకు మరీ అంత దగ్గరగా వెళ్లి వీడియో షూట్‌ చేయాలా? అలా చేస్తే ఎవరికైనా ఇరిటేషన్‌ వస్తుంది.. ఫోన్‌ను అలాగే తీసుకెళ్లకుండా తిరిగిచ్చేసినందుకు సంతోషించండి. అని కామెంట్లు చేస్తున్నారు.

 

చదవండి: రూ.50 లక్షల ప్రైజ్‌మనీ.. ఇంతవరకు ముట్టనేలేదు: బిగ్‌బాస్‌ విజేత

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement