
బాలనటిగా వెండితెరకు పరిచయమైంది కీర్తి సురేశ్ (Keerthy Suresh). మలయాళంలో మూడు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించింది. గీతాంజలి సినిమాతో హీరోయిన్‌గా మారింది. నేను శైలజ మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. తెలుగుతోపాటు తమిళ, మలయాళ భాషల్లోనూ పలు సినిమాలు చేసింది. ఇటీవలే బేబీ జాన్‌తో హిందీ బాక్సాఫీస్‌కు పరిచయమైంది.
అంకుల్ అని పిలవొద్దు
సౌత్‌లో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతున్న కీర్తిని ఓ హీరో పిలిచి మరీ తనను అంకుల్ అని పిలవొద్దని చెప్పాడట! ఇంతకీ ఆ హీరో ఎవరంటే మలయాళ నటుడు దిలీప్. 2002లో దిలీప్ కథానాయకుడిగా నటించిన చిత్రం కుబేరన్. ఇందులో అతడు ముగ్గురు పిల్లల్ని దత్తత తీసుకుంటాడు. అందులో ఒకరు కీర్తి సురేశ్. దిలీప్ కూతురిగా నటించిన కీర్తి.. తర్వాతికాలంలో అతడి ప్రేయసిగా నటించింది. రింగ్ మాస్టర్ (2014) మూవీలో దిలీప్ గర్ల్‌ఫ్రెండ్‌గా యాక్ట్ చేసింది. హీరోయిన్‌గా ఇది ఆమెకు రెండో సినిమా.

రింగ్ మాస్టర్ సినిమాలో దిలీప్‌తో కీర్తి సురేశ్
ఆయన కూతురిగా, ప్రేయసిగా..
ఈ విషయాన్ని కీర్తి తాజాగా ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకుంది. ఆమె మాట్లాడుతూ.. దిలీప్ (Dileep) సరసన హీరోయిన్‌గా నటించేందుకు ఎక్కువగా ఆలోచించలేదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆయన్ను చూస్తూనే ఉన్నాను. తనేమీ మారలేదు, అలాగే ఉన్నాడు. రింగ్ మాస్టర్ మూవీలో నేనే తన గర్ల్‌ఫ్రెండ్ అని తెలియగానే నన్ను పిలిచి ఓ మాట చెప్పారు. చిన్నప్పుడు అంకుల్ అని పిలిచేదాన్నని.. అలా మాత్రం పిలవొద్దని కోరాడు. కావాలంటే చేట్ట (అన్నయ్య) అని పిలవమన్నాడు. నేను వెంటనే సరే చేట్ట అన్నాను. రింగ్‌మాస్టర్ నా మొదటి హిట్ సినిమా అని చెప్పుకొచ్చింది.

పేరెంట్స్ సలహా
పేరెంట్స్ మేనక-సురేశ్ కుమార్ గురించి చెప్తూ.. 'సినిమాల్లోకి వచ్చేస్తానన్నప్పుడు అమ్మానాన్న నాకు కొన్ని సలహాలిచ్చారు. సమయపాలన పాటించాలని అమ్మ చెప్పేది. తను సమయానికి సెట్‌లో ఉంటానని నేను కూడా దాన్ని అనుసరించాలని నొక్కి చెప్పింది. సెట్‌లో పనిచేసేవాళ్ల దగ్గరనుంచి డైరెక్టర్ వరకు అందరికీ ఒకేరకమైన గౌరవం ఇవ్వాలంది.
అదే చాలా కష్టం
ఇండస్ట్రీలో నేను మంచి పేరు సంపాదించుకున్నాను. దాన్ని అలాగే కాపాడుకోవాలని నాన్న చెప్పాడు. మా ఇంట్లోని వాళ్లందరూ మంచి విమర్శకులు. అమ్మానాన్న కంటే కూడా నా సోదరి నుంచి ప్రశంసలు అందుకోవడం అత్యంత కష్టతరమైన విషయం. నేనేంటో నిరూపించుకోవాలి, వాళ్ల దగ్గర మంచి మార్కులు కొట్టేయాలని ఎప్పుడూ అనుకుంటూ ఉంటాను' అని కీర్తి చెప్పుకొచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment