మహబూబాబాద్: పెళ్లి బరాత్‌లో పాల్గొని వస్తున్న డీజే వాహనం అదుపు తప్పి చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర, ఇద్దరికి స్వల్ప గాయాలు కాగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఈ ఘటన హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం అంబాల గ్రామ శివారులో జరిగింది.
పోలీసుల కథనం ప్రకారం హసన్‌పర్తి మండలం పెంబర్తికి చెందిన కొయ్యడ రాకేష్, జోరుక సందీప్ , కక్కర్ల పృథ్వీ (18), పున్నంచందర్, హసన్‌పర్తికి చెందిన మేకల జిధ్యాన్.. ఏపీ 36 టీఏ 4854 నంబరు గల టాటా ఏస్ డీజే వాహనంతో శనివారం పరకాలలో జరిగిన ఓ పెళ్లి బరాత్‌లో పాల్గొన్నారు. ఆదివారం ఉదయం తమ ఇళ్లకు వస్తున్న క్రమంలో కమలాపూర్ మండలం అంబాల గ్రామ శివారులో డీజే వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీకొంది.
ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర, ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటినా ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం 108లో వరంగల్ ఎంజీఎం తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కక్కెర్ల పృథ్వీ మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. మృతుడి తండ్రి రాంబాబు ఫిర్యాదు మేరకు డ్రైవర్ కొయ్యడ రాకేశ్‌పె కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సంజీవ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment