
హరీష్ కె.వి, కల్పిక, పృథ్వీ, రాకేందు మౌళి, కల్యాణ్ విఠపు
‘పెళ్లి చేసుకోకుండా సన్యాసి అయ్యాను.. ఈ కేసును వాదించి సన్నాసి అయ్యాను’ అంటూ పృథ్వీ డైలాగ్‌తో ‘మై డియర్ మార్తాండం’ టీజర్ ప్రారంభమవుతుంది. ‘థర్టీ ఇయర్స్ ఇక్కడ..’ అంటూ తనదైన కామెడీ మేనరిజమ్, టైమింగ్‌తో ప్రేక్షకులకు నవ్వులు పంచుతున్న పృథ్వీ టైటిల్ పాత్రలో రూపొందిన చిత్రం ‘మై డియర్ మార్తాండం’. రాకేందు మౌళి, కల్యాణ్ విఠపు, కల్పిక గణేశ్ కీలక పాత్రల్లో నటించారు. హరీష్ కె.వి. దర్శకత్వంలో సయ్యద్ నిజాముద్దీన్ నిర్మించిన ఈ సినిమా టీజర్‌ను శనివారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా పృథ్వీ మాట్లాడుతూ– ‘‘హరీశ్ పక్కా స్క్రిప్ట్‌తో సినిమాను సెట్స్‌కి తీసుకెళ్లారు.
ఒక్క డైలాగ్ కూడా మార్పు చేయకుండా 18 రోజుల్లో షూటింగ్ పూర్తి చేశాం. లాయర్ పాత్రలో నటించాను. అమాయకుడిగా ఉండే తెలివైన వాడి పాత్ర నాది. మంచి పాత్ర చేయడమే కాదు.. మంచి పారితోషికం కూడా అందుకున్నా (నవ్వుతూ). వై.ఎస్. జగన్‌మోహన్ రెడ్డిగారు మా సినిమా టీజర్ రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది’’ అన్నారు. ‘‘మాది కోర్టు రూమ్ క్రైమ్ కామెడీ. అనుకున్న సమయంలో షూటింగ్ పూర్తి చేశామంటే అందరి సహకారమే కారణం. ఇందుకు యూనిట్ అందరికీ ధన్యవాదాలు’’ అన్నారు హరీశ్ కె.వి. కల్పిక, రాకేందు మౌళి, కల్యాణ్ విఠపు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: పవన్, కెమెరా: ర్యాండీ.
Comments
Please login to add a commentAdd a comment