
రాకేష్, రమ్య, వెంకట్ ప్రధాన పాత్రల్లో రూపొందిన సినిమా ‘అనుకోని ఓ కథ’. ఏ.ఎం.జె. ఫిలిమ్స్ పతాకంపై జనార్ధన్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ఫలాన్ని స్వరపరచిన ఈ చిత్రం పాటల్ని హైదరాబాద్‌లో రిలీజ్ చేశారు. నిర్మాత రాజ్ కందుకూరి మాట్లాడుతూ– ‘‘టైటిల్ బాగుంది. ట్రైలర్ సినిమాపై ఆసక్తి పెంచుతోంది. థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన ఈ మూవీ ప్రేక్షకులను అలరిస్తుందనుకుంటున్నా. ఫలాన్ని చాలా సినిమాలకు పనిచేశారు. తన సంగీతం బాగుంటుంది’’ అన్నారు.
‘‘మంచి హారర్ మూవీ ఇది. జనార్ధన్ చక్కగా తీశారు. కథ బాగుంటే చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా లేకుండా విజయవంతమవుతాయి. ఈ సినిమా హిట్ కావాలి’’ అన్నారు తెలంగాణ ఫిలించాంబర్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణగౌడ్. ‘‘తక్కువ బడ్జెట్‌లో సినిమా తీశా. అన్ని వర్గాల వారికీ నచ్చే అంశాలున్నాయి’’ అన్నారు జనార్ధన్. ఎల్బీ నగర్ ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య, నిర్మాతలు ప్రసన్నకుమార్, సాయి వెంకట్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment