‘శివరామరాజు’ ఫేమ్‌ వెంకట్‌ హీరోగా ‘హరుడు’... ఆకట్టుకుంటున్న గ్లింప్స్ | Harudu Movie Glimpse Out | Sakshi
Sakshi News home page

‘శివరామరాజు’ ఫేమ్‌ వెంకట్‌ హీరోగా ‘హరుడు’... ఆకట్టుకుంటున్న గ్లింప్స్

Published Sat, Oct 5 2024 6:06 PM | Last Updated on Sat, Oct 5 2024 6:15 PM

Harudu Movie Glimpse Out

శివరామరాజు ఫేమ్ వెంకట్ తొలిసారి మాస్ హీరోగా నటిస్తున్న చిత్రం హరుడు. డాక్టర్ ప్రవీణ్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాజ్ తాళ్ళూరి దర్శకుడు. షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు చురుగ్గా సాగుతున్న హరుడు చిత్రం గ్లింప్స్ శనివారంనాడు హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో విడుదల చేశారు.

అనంతరం నిర్మాత డాక్టర్ ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ,   సినిమా ఈ స్థాయికి రావడానికి కారణం ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేశారు. ఈ సినిమా దర్శకుడు రాజ్ తాళ్లూరి రాత్రింబవళ్ళు పనిచేశారు. హీరో వెంకట్, శ్రీహరి, సలోని, హెబ్బా పటేల్ నటించారు. ఇందులోని పాటలు ఆదరణ పొందేలా వున్నాయి. జెన్నా పాటలకు సంగీతం బాగా సమకూర్చారు. ఈరోజు విడుదలైన గ్లింప్స్ చాలా బాగున్నాయి. మంచి విజయం సాధించాలని కోరుకుంటన్నా అన్నారు.

దర్శకుడు రాజ్ తాళ్ళూరి  మాట్లాడుతూ, ముందుగా నిర్మాత డాక్టర్ ప్రవీణ్ రెడ్డి కి థ్యాంక్స్. ఐదు నిముషాల్లోనే కథ విని ఓకే చేశారు. వెంకట్ గారితో ఐదేళ్ళ జర్నీ వుంది. లవర్ బాయ్ గా చేసిన ఆయన మాస్ హీరోగా ఇందులో చేశారు. నటశాసింగ్  కూడా నటించింది. సంగీత దర్శకుడు జిన్నా, ఎడిటర్ మారుతీ బాగా పనిచేశారు. నాకు దర్శకుల టీమ్ సపోర్ట్ గా వుండడంతో అవుట్ పుట్ బాగా వచ్చింది అన్నారు.

హీరో వెంకట్ మాట్లాడుతూ, హరుడు చిత్రం కమర్షియల్ ఎలిమెంట్ తో మాస్ ఎంటర్ టైనర్ గా వుంటుంది. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా 60 శాతం పూర్తయింది. నిర్మాత డాక్టర్ అయినా...  సినిమా పై తపనతో వచ్చారు. ఆయనకు మంచి హిట్ పడాలని ఆశిస్తున్నాను. నాకు పవర్ ఫుల్ రోల్ దర్శకులు ఇచ్చారు. మాస్ పాత్ర నేను మొదటిసారి చేశాను. నా పాత్రకు ధీటుగా హెబ్బాపటేల్ పాత్ర వుంటుంది. డబ్బింగ్ లో ఆమె నటన చూశాను. అలాగే నటశాసింగ్ మరో పాత్ర చేసింది. స్పెషల్ సాంగ్ లో సలోని చేశారు. ఇందులో ఐదు పాటలున్నాయి. సంగీత దర్శకుడు మణి జెన్నా మంచి బాణీలు ఇచ్చారు. మాస్ సినిమాకు ఫైట్స్ కీలకం. శివరాజ్ మాస్టర్ బాగా కంపోజ్ చేశారు. లోగడ షూటింగ్ లో నాకు గాయాలు అయ్యాయి. అందుకే కొంత గేప్ కూడా తీసుకున్నాను. ఈ సినిమాలో తగు జాగ్రత్తలు తీసుకుని ఫైట్స్ చేశాను. వచ్చే నెలలో సినిమా రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నాం అని చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement