![Actor Venkat Reveals His Accident Incident in Aa Aiduguru Movie - Sakshi](/styles/webp/s3/article_images/2022/03/3/venkat1.jpg.webp?itok=hos0u-HU)
'సీతారాముల కల్యాణం' సినిమాతో నటుడిగా వెండితెరపై ఎంట్రీ ఇచ్చాడు వెంకట్. ఈ సినిమా మంచి హిట్ సాధించినప్పటికీ అతడికి గుర్తింపు వచ్చింది మాత్రం 'అన్నయ్య' మూవీతో! ఈ చిత్రంలో చిరంజీవి తమ్ముడిగా నటించాడు వెంకట్. ఇందులో మెగాస్టార్ అతడిని జెమ్స్ అని పిలుస్తుంటాడు. దీంతో చాలామంది ఇప్పటికీ వెంకట్‌ను జెమ్స్ అనే పిలుచుకుంటారు. ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా సింగిల్‌గా ఉన్నాడీ యాక్టర్. తాజాగా అతడు ఓ టీవీ షోకు హాజరై వ్యక్తిగత విషయాల గురించి వెల్లడించాడు.
చదువు మీద ధ్యాస లేదన్న వెంకట్ మోడలింగ్ నుంచి ఇండస్ట్రీకి వచ్చానని తెలిపాడు. ఒక డ్యాన్స్ మాస్టర్ అందరిముందు తనను అవమానించాడని, తాను దేనికీ పనికిరానని, ఎక్కడినుంచి పట్టుకొచ్చారని విసుగు ప్రదర్శించాడని వెల్లడించాడు. ఒకసారైతే ప్రముఖ నటుడు అక్కినేని నాగేశ్వరరావు చెంప చెల్లుమనిపించాడని చెప్పుకొచ్చాడు.
ఆ ఐదుగురు సినిమా షూటింగ్ సమయంలో పెద్ద ప్రమాదం జరిగిందని తెలిపాడు వెంకట్. రాడ్ల మీద ఎక్కి పైకి దూకాల్సిన సీన్ ముందుకు దూకబోయి వెనక్కు పడ్డట్లు తెలిపాడు. ఆ ప్రమాదంలో పెద్ద గాయాలే అయ్యాయన్న ఆయన మూడు నెలలపాటు ఆస్పత్రి బెడ్‌కే పరిమితమైనట్లు పేర్కొన్నాడు. ఈ యాక్సిడెంట్ వల్ల చాలా సినిమాలు మిస్ అయ్యాయని చెప్తూ బాధపడ్డాడు.
Comments
Please login to add a commentAdd a comment