
తెలుగు సినీ దిగ్గజం అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి వేడుకలు హైదరాబాద్‌లో నిర్వహించారు. అన్నపూర్ణ స్టూడియోలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో టాలీవుడ్ అగ్ర సినీతారలంతా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో ఏఎన్‌ఆర్ మాట్లాడిన చివరి ఆడియో సందేశాన్ని ప్రదర్శించారు.
ఏఎన్‌ఆర్ ఆడియోలో మాట్లాడుతూ..' నా కోసం మీరు అంతా ఆ దేవుడిని ప్రార్థిస్తున్నారని తెలుసు. మా కుటుంబ సభ్యులు కూడా ఎప్పటికప్పుడు నా ఆరోగ్య సమాచారం గురించి మీకు చెబుతూనే ఉన్నారు. మీ ప్రేమ, అభిమానానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. త్వరలోనే నేను మీ ముందుకు వస్తానన్న నమ్మకం ఉంది. మీరు చూపిన ప్రేమ, అభిమానాలకు ఎప్పటికీ రుణపడి ఉంటా. ఇక సెలవు' అంటూ చివరిసారిగా ఐసీయూ నుంచి సందేశమిచ్చారు. ఇవాళ శతజయంతి వేడుకల్లో నాగేశ్వరరావు మాట్లాడిన ఆడియో సందేశాన్ని వినిపించారు. ఇది విన్న మెగాస్టార్ చిరంజీవి, నటి రమ్యకృష్ణ ఎమోషనలై కంటతడి పెట్టుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment