Madhapur: డ్రగ్స్‌తో పాటు వ్యభిచారం కూడా! | Sensational Details Revealed In Hyderabad Madhapur Rave Party Case, Know In Details - Sakshi
Sakshi News home page

Madhapur Rave Party Case: డ్రగ్స్‌తో పాటు వ్యభిచారం కూడా!.. సినీ పరిశ్రమలో సంబంధాలపై ఆరా

Published Thu, Aug 31 2023 11:38 AM | Last Updated on Thu, Aug 31 2023 1:24 PM

Sensational Details In Madhapur Rave Party Case - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  మాదాపూర్‌ డ్రగ్స్‌ కేసులో మరో కోణం బయటపడింది. డ్రగ్స్‌ పార్టీలతో పాటు వ్యభిచారం దందా కూడా నిర్వహిస్తున్నట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ క్రమంలో కేసులో దర్యాప్తులో లోతుకు పోయే కొద్దీ మరిన్ని విషయాలు వెలుగు చూస్తున్నాయి. 

మాదాపూర్‌లోని విఠల్‌ రావు నగర్‌ ఫ్రెష్‌ లివింగ్‌ అపార్ట్‌మెంట్‌లో రేవ్‌ పార్టీని భగ్నం చేసిన పోలీసులకు.. దర్యాప్తులో కీలక విషయాలు తెలుస్తున్నాయి. గతంలోనూ వెంకట్, బాలాజీలపై వ్యభిచార నిర్వహణ కేసులు ఉన్నట్లు తేలింది. తాజాగా మాదాపూర్‌లోని అపార్ట్‌మెంట్‌లో డ్రగ్స్‌ పట్టుబడగా.. ఫ్లాట్‌లో ఢిల్లీకి చెందిన ఇద్దరు యువతులు ఉండడంతో వ్యభిచార దందా గుట్టురట్టయ్యింది.  

పలు చిత్రాలకు ఫైనాన్షియర్‌గా వ్యవహరించిన వెంకట్‌ ఈ డ్రగ్స్‌ సప్లై ప్రధాన సూత్రధారిగా తేలింది. సినిమా వెంకట్‌తో పాటు బాలాజీలు ఆ దందా నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. సినిమా అవకాశాల పేరిట ఆ ఇద్దరినీ రెండు రోజులుగా అదే అపార్ట్‌మెంట్‌లో ఉంచినట్లు సమాచారం.  ఈ అసాంఘిక కార్యకలాపాల కోసం రూమ్‌ నెంబర్‌ 804ను ఉపయోగించుకుంటున్నారు. వారానికి చొప్పున సర్వీస్ అపార్ట్‌మెంట్‌ను రెంటుకు తీసుకొని డ్రగ్ పార్టీలు నిర్వహిస్తున్నారు.  డ్రగ్స్ దందాలతో పాటు వ్యభిచారం నిర్వహిస్తున్నారు.   

అయితే.. గతంలోనూ వ్యభిచారం నిర్వహిస్తుండగా  రెండుసార్లు ఈ ఇద్దరిని పోలీసులు పట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇక తాజా సోదాల్లో అధికారులు వెంకట్ దగ్గర నుంచి 15 గ్రాముల ఎండిఎంఏ, 30 ఎల్ ఎస్ టి పిల్స్ తొ పాటు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. గోవా నుంచి డ్రగ్స్‌ తెప్పించి వెంకట్‌.. తాను  ఉపయోగించడంతో పాటు మరికొందరికి అమ్ముతున్నట్లు గుర్తించారు.  వెంకట్, బాలాజీ డ్రగ్ కస్టమర్లు ఎవరు? సినీ పరిశ్రమలో ఎవరైనా ఉన్నారా? అనేదానిపై నార్కోటిక్ టీమ్ ఆరాలు తీస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement