రాయలసీమ ప్రేమకథ | Rayalaseema Love Story Details | Sakshi
Sakshi News home page

రాయలసీమ ప్రేమకథ

Nov 17 2018 3:37 AM | Updated on Nov 17 2018 3:37 AM

Rayalaseema Love Story Details - Sakshi

హృశాలి

వెంకట్‌ హీరోగా, హృశాలి, పావని హీరోయిన్లుగా రామ్‌ రణధీర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రాయలసీమ లవ్‌ స్టోరీ’. ఏ వన్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ మూవీస్‌ పతాకంపై పంచలింగాల బ్రదర్స్‌ రాయల్‌ చిన్నా, నాగరాజు నిర్మించిన ఈ చిత్రం డిసెంబరులో విడుదల కానుంది. రామ్‌ రణధీర్‌ మాట్లాడుతూ– ‘‘నాపై పూర్తి నమ్మకంతో ఈ చిత్రం నిర్మించారు నిర్మాతలు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా మంచి ఔట్‌ పుట్‌ ఇచ్చాను. యువతని టార్గెట్‌ చేస్తూ రూపొందించిన మా సినిమా తప్పకుండా హిట్‌ అవుతుందన్న నమ్మకం ఉంది.

ఇటీవల రిలీజైన మోషన్‌ పోస్టర్, టీజర్‌కు  మేం  ఊహించినదానికంటే ఎక్కువ స్పందన రావడం ఆనందంగా ఉంది’’ అన్నారు. ‘‘సినిమా చాలా బాగా వచ్చింది. మా చిత్రం టీజర్‌కు వచ్చిన స్పందన చూసి సినిమాపై మరింత నమ్మకం పెరిగింది. పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు పూర్తయ్యాయి. త్వరలోనే ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించనున్నాం’’ అని రాయల్‌ చిన్నా, నాగరాజు అన్నారు. నాగినీడు, నల్లవేణు, పృథ్వీ, జీవా, తాగుబోతు రమేష్, అదుర్స్‌ రఘు తదితరులు నటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement