
అర్జున్, పావని
అర్జున్, మధుసూదన్, పావని ముఖ్య తారలుగా తెరకెక్కిన చిత్రం ‘అందమా అందుమా’. శ్రీ కృపామణి ఫిలిమ్స్ పతాకంపై ప్రళయ కావేరి మధుసూదన్‌రావు స్వీయ దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రం ఇటీవల సెన్సార్ పూర్తి చేసుకుంది. ప్రళయ కావేరి మధుసూదన్‌రావు మాట్లాడుతూ– ‘‘అందమైన ప్రేమకథా చిత్రమిది. యువతరంతో పాటు కుటుంబమంతా కలసి చూసేలా ఉంటుంది. కథానుగుణంగా ఉన్న నాలుగు ఫైట్స్‌ని అవినాష్ మాస్టర్ చక్కగా కంపోజ్ చేశారు.
ఇటీవలే విడుదలైన పాటలకు మంచి స్పందన వస్తోంది. పావని ఇప్పటి వరకూ పలు సినిమాలు చేసినా ఇందులో నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్ర చేశారు. అర్జున్‌కి మంచి పేరుతో పాటు నటుడిగా మరిన్ని అవకాశాలు వస్తాయి. ఈ సినిమాలోని ప్రతి పాత్ర కథ పరంగా సాగుతుంది. మా సినిమా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. త్వరలోనే సినిమా విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: యస్.యస్. ఆత్రేయ, కెమెరా: ధీరజ్.
Comments
Please login to add a commentAdd a comment