
న్యూఢిల్లీ: కెరీర్‌లో 55వ డబుల్స్ టైటిల్ సాధించాలని ఆశించిన భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్‌కు నిరాశ ఎదురైంది. అమెరికాలో జరిగిన విన్‌స్టాన్ సాలెమ్ ఓపెన్ టోర్నీలో పేస్–సెరెటాని (అమెరికా) జంట రన్నరప్‌గా నిలిచింది. ఫైనల్లో పేస్ ద్వయం 4–6, 2–6తో రోజర్ (నెదర్లాండ్స్)–టెకావ్ (రొమేనియా) జంట చేతిలో ఓడిపోయింది. రన్నరప్‌గా నిలిచిన పేస్ జోడీ ఖాతాలో 20,040 డాలర్ల (రూ. 14 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 150 ర్యాంకింగ్ పాయింట్లు చేరాయి.
Comments
Please login to add a commentAdd a comment