Winston Salem
-
రన్నరప్ పేస్ జంట
న్యూఢిల్లీ: కెరీర్లో 55వ డబుల్స్ టైటిల్ సాధించాలని ఆశించిన భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్‌కు నిరాశ ఎదురైంది. అమెరికాలో జరిగిన విన్స్టాన్ సాలెమ్ ఓపెన్ టోర్నీలో పేస్–సెరెటాని (అమెరికా) జంట రన్నరప్‌గా నిలిచింది. ఫైనల్లో పేస్ ద్వయం 4–6, 2–6తో రోజర్ (నెదర్లాండ్స్)–టెకావ్ (రొమేనియా) జంట చేతిలో ఓడిపోయింది. రన్నరప్‌గా నిలిచిన పేస్ జోడీ ఖాతాలో 20,040 డాలర్ల (రూ. 14 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 150 ర్యాంకింగ్ పాయింట్లు చేరాయి. -
సెమీస్‌లో పేస్ జంట...
విన్స్టన్-సాలెమ్ (అమెరికా): టాప్ సీడ్ జోడిని బోల్తా కొట్టించిన లియాండర్ పేస్ (భారత్)-బెగెమన్ (జర్మనీ) ద్వయం విన్స్టన్ సాలెమ్ ఓపెన్ టెన్నిస్ టోర్నీలో సెమీఫైనల్‌కు చేరింది. క్వార్టర్ ఫైనల్లో పేస్-బెగెమన్ జోడీ 6-4, 6-4తో కుబోట్ (పోలాండ్)-జిమోనిచ్ (సెర్బియా) ద్వయంపై సంచలన విజయం సాధించింది. మరో మ్యాచ్‌లో గెలిస్తే పేస్ ఈ సీజన్లో తొలిసారి ఏటీపీ టోర్నీలో ఫైనల్‌కు చేరుకుంటాడు.