
సెమీస్‌లో పేస్ జంట...
విన్‌స్టన్-సాలెమ్ (అమెరికా): టాప్ సీడ్ జోడిని బోల్తా కొట్టించిన లియాండర్ పేస్ (భారత్)-బెగెమన్ (జర్మనీ) ద్వయం విన్‌స్టన్ సాలెమ్ ఓపెన్ టెన్నిస్ టోర్నీలో సెమీఫైనల్‌కు చేరింది.
క్వార్టర్ ఫైనల్లో పేస్-బెగెమన్ జోడీ 6-4, 6-4తో కుబోట్ (పోలాండ్)-జిమోనిచ్ (సెర్బియా) ద్వయంపై సంచలన విజయం సాధించింది. మరో మ్యాచ్‌లో గెలిస్తే పేస్ ఈ సీజన్‌లో తొలిసారి ఏటీపీ టోర్నీలో ఫైనల్‌కు చేరుకుంటాడు.