Kim Sharma Deletes All Pictures Of Leander Paes From Her Instagram Account - Sakshi
Sakshi News home page

Kim Sharma: టెన్నిస్‌ స్టార్‌తో నటి తెగదెంపులు.. ఫోటోలు డిలీట్‌ చేసిన బ్యూటీ

Published Wed, Apr 5 2023 3:26 PM | Last Updated on Wed, Apr 5 2023 3:41 PM

Kim Sharma Deletes All Pictures of Leander Paes from Her Instagram - Sakshi

ఖడ్గం బ్యూటీ కిమ్‌ శర్మ, టెన్నిస్‌ ఛాంపియన్‌ లియాండర్‌ పేస్‌ల బంధానికి బీటలు వారింది. వీరిద్దరూ విడిపోయారంటూ సోషల్‌ మీడియాలో కొంతకాలంగా పుకార్లు షికార్లు చేస్తున్న విషయం తెలిసిందే కదా! ఈ క్రమంలో కిమ్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో లియాండర్‌ పేస్‌తో దిగిన ఫోటోలన్నింటినీ డిలీట్‌ చేయడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరినట్లైంది. రెండేళ్లుగా డేటింగ్‌ చేస్తున్న ఈ జంట త్వరలో పెళ్లిపీటలెక్కుతారనుకుంటే ఇలా సడన్‌గా బ్రేకప్‌ చెప్పుకున్నారేంటని ఆశ్చర్యపోతున్నారు అభిమానులు.

కిమ్‌కు బ్రేకప్‌ కొత్త కాదు!
ఖడ్గం సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ మగధీరలో 'ఏం పిల్లడో ఎల్దం వస్తవా' స్పెషల్‌ పాటతో మరింత పాపులర్‌ అయింది. హిందీలోనూ పలు చిత్రాలు చేసిన ఆమె సినిమాల కంటే కూడా లవ్‌ ఎఫైర్స్‌తోనే ఎక్కువగా వార్తల్లో నిలిచింది. మాజీ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌తో ప్రేమాయణం నడిపిన ఆమె పలు కారణాలతో అతడికి బ్రేకప్‌ చెప్పింది. 2010లో కెన్యా వ్యాపారవేత్తను పెళ్లాడగా కొంతకాలానికే అతడికి విడాకులిచ్చేసింది. తర్వాత నటుడు హర్షవర్ధన్‌ రాణేతో ప్రేమాయణం సాగించినప్పటికీ అదీ ఎంతోకాలం నిలవలేదు. రెండేళ్లుగా టెన్నిస్‌ స్టార్‌ లియాండర్‌పేస్‌తో రిలేషన్‌లో ఉన్న ఆమె చివరకు అతడికి కూడా బ్రేకప్‌ చెప్పినట్లు తెలుస్తోంది.

లియాండర్‌కు కూతురు కూడా ఉంది..
అటు లియాండర్‌ పేస్‌ కూడా ఎంతోమందితో ఎఫైర్స్‌ నడిపాడు. ప్రముఖ మోడల్‌ రియా పిళ్లైతో సహజీవనం చేయగా వీరికి ఓ కుమార్తె కూడా జన్మించింది. తర్వాత కిమ్‌తో లవ్‌లో పడ్డాడు. 2020 చివరిలో రిటైర్మెంట్‌ ప్రకటించిన ఈ టెన్నిస్‌ స్టార్‌.. 1992 నుంచి 2016 వరకూ మొత్తం 7 ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించాడు. అతని సుదీర్ఘ కెరీర్‌లో 1996లో జరిగిన అట్లాంటా ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించడమే కాకుండా 18 గ్రాండ్‌స్లామ్‌(డబుల్స్‌, మిక్స్‌డ్‌ డబుల్స్‌)ల్లో విజేతగా నిలిచాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement