మిస్ యూనివర్స్ 2018- కాట్రియానా గ్రే
బ్యాంకాక్: మిస్ యూనివర్స్ 2018 కిరీటాన్ని ఫిలిప్పీన్స్ యువతి కాట్రియానా గ్రే సొంతం చేసుకుంది. 93 దేశాలకు చెందిన యువతులు ఈ కిరీటం కోసం పోటీపడగా కాట్రియానా విజేతగా నిలిచింది. సోమవారం బ్యాంకాక్‌లో జరిగిన ఫైనల్లో న్యాయనిర్ణేతలు ఆమెను విజేతగా ప్రకటించారు. తొలి రన్నరప్‌గా దక్షిణాఫ్రికాకు చెందిన తామరిన్ గ్రీన్, రెండో రన్నరప్‌గా వెనెజెవిలాకు చెందిన స్టీఫనీ గుటీరెజ్ నిలిచారు. సింగర్, మోడల్‌గా పేరొందిన కాట్రియానా వేదికపై ఎరుపు రంగు గౌనులో తళుక్కుమంది. ఓ అగ్నిపర్వతాన్ని ప్రేరణగా తీసుకుని తాను ఎరుపు రంగు గౌనును ధరించానని కాట్రియానా చెప్పింది. గతేడాది మిస్ యూనివర్స్‌గా నిలిచిన డేమీ లీ నీల్‌పీటర్స్ కాట్రియానాకు కిరీటాన్ని అలంకరించింది. ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డ్యుటెర్టె కాట్రియానాకు అభినందనలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment