
సాక్షి, ఖమ్మం: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఈనెల 21న జరిగిన వీపీఆర్ మిసెస్ ఇండియా సీజన్–2లో ఖమ్మం నగరానికి చెందిన వివాహిత మహ్మద్ ఫర్హా రన్నరప్‌గా నిలిచారు. ఫొటోజెనిక్ విభాగంలో మిసెస్ ఇండియాగా ఆమె ఎంపికయ్యారు. దేశవ్యాప్తంగా 912 మంది వివాహితలు ఈ పోటీలకు దరఖాస్తు చేసుకోగా.. 41 మంది ఫైనల్‌కు అర్హత సాధించారు. వీరిలో తెలంగాణ నుంచి ఫర్హా మాత్రమే ఎంపికయ్యారు. ఎంబీఏ చదివిన ఫర్హా, హ్యూమన్ రైట్స్, సోషల్ జస్టిస్ మిషన్, మహిళా సాధికారత సంస్థలకు ఖమ్మం కార్య దర్శిగా సేవలందిస్తున్నారు. భర్త, కుటుంబ సభ్యుల సహకారంతో ఈ విజయం సాధిం చానని, మహిళా హక్కుల కోసం పోరాడటమే తన లక్ష్యమని ఆమె పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment