
స్వదేశంలో తొలిసారి టైటిల్ సాధించాలని ఆశించిన జపాన్ టెన్నిస్ కొత్త సంచలనం నయోమి ఒసాకాకు రెండోసారీ నిరాశే ఎదురైంది. టోక్యోలో ఆదివారం ముగిసిన పాన్ పసిఫిక్ ఓపెన్ టోర్నీలో ప్రపంచ ఏడో ర్యాంకర్ ఒసాకా రన్నరప్‌గా నిలిచింది. ఫైనల్లో మాజీ నంబర్‌వన్ కరోలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్) 6–4, 6–4తో ఒసాకాను ఓడించి విజేతగా నిలిచింది. రెండేళ్ల క్రితం ఇదే టోర్నీలో రన్నరప్‌గా నిలిచిన ఒసాకా ఇటీవలే యూఎస్ ఓపెన్‌లో సెరెనాను ఓడించి గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్ నెగ్గిన తొలి జపాన్ ప్లేయర్‌గా రికార్డు సృష్టించింది.
Comments
Please login to add a commentAdd a comment