Pan Pacific Open
-
జయహో జెంగ్...
టోక్యో: పారిస్ ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత, చైనా టెన్నిస్ స్టార్ కిన్వెన్ జెంగ్ ఒకే విజయంతో రెండు లక్ష్యాలు సాధించింది. ఆదివారం ముగిసిన టొరే పాన్ పసిఫిక్ ఓపెన్ డబ్ల్యూటీఏ–500 టోర్నీలో ఆమె విజేతగా నిలిచింది. ఈ గెలుపుతో ప్రపంచ ఏడో ర్యాంకర్ కిన్వెన్ కెరీర్లో ఐదో సింగిల్స్ టైటిల్ సాధించడంతోపాటు సీజన్ ముగింపు ప్రతిష్టాత్మక టోర్నీ డబ్ల్యూటీఏ ఫైనల్స్‌కు అర్హత పొందింది. 2020 ఆ్రస్టేలియన్ ఓపెన్ చాంపియన్ సోఫియా కెనిన్ (అమెరికా)తో జరిగిన ఫైనల్లో కిన్వెన్ జెంగ్ 7–6 (7/5), 6–3తో విజయం సాధించింది. గంటా 52 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో కిన్వెన్ ఏకంగా 16 ఏస్‌లు సంధించింది. కిన్‌వెన్‌కు 1,42,000 డాలర్ల (రూ. 1 కోటీ 19 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 500 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
మళ్లీ రన్నరప్‌గా నయోమి ఒసాకా
స్వదేశంలో తొలిసారి టైటిల్ సాధించాలని ఆశించిన జపాన్ టెన్నిస్ కొత్త సంచలనం నయోమి ఒసాకాకు రెండోసారీ నిరాశే ఎదురైంది. టోక్యోలో ఆదివారం ముగిసిన పాన్ పసిఫిక్ ఓపెన్ టోర్నీలో ప్రపంచ ఏడో ర్యాంకర్ ఒసాకా రన్నరప్‌గా నిలిచింది. ఫైనల్లో మాజీ నంబర్‌వన్ కరోలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్) 6–4, 6–4తో ఒసాకాను ఓడించి విజేతగా నిలిచింది. రెండేళ్ల క్రితం ఇదే టోర్నీలో రన్నరప్‌గా నిలిచిన ఒసాకా ఇటీవలే యూఎస్ ఓపెన్‌లో సెరెనాను ఓడించి గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్ నెగ్గిన తొలి జపాన్ ప్లేయర్‌గా రికార్డు సృష్టించింది. -
సానియా జోడిదే టైటిల్
టోక్యో: ఈ ఏడాది భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఖాతాలో ఎనిమిదో డబుల్స్ టైటిల్ చేరింది. చెక్ రిపబ్లిక్ క్రీడాకారిణి బార్బరా స్ట్రికోవాతో కలిసి పాన్ పసిఫిక్ టోర్నమెంట్లో విజేతగా నిలిచింది. శనివారం జరిగిన తుది పోరులో సానియా ద్వయం 6-1, 6-1 తేడాతో చైనా జోడి చెన్ లియాంగ్-హవాన్ యంగ్ పై గెలిచి ట్రోఫీని కైవసం చేసుకుంది. ఏకపక్షంగా సాగిన పోరులో సానియా ద్వయం వరుస సెట్లను చేజిక్కించుకుని విజయం సాధించింది. గత నెల్లో సిన్సినాటి ఓపెన్ టైటిల్ ను గెలిచిన సానియా-స్ట్రికోవాల ద్వయం అదే ఊపును పాన్ ఫసిఫిక్ టోర్నీలో కనబరిచి రెండో టైటిల్ ను ముద్దాడింది. గత నాలుగు సంవత్సరాల్లో సానియాకు ఇది మూడో పాన్ పసిఫిక్ టైటిల్. అంతకుముందు 2013లో, 2014లో కారాబ్లేక్తో కలిసి సానియా ఈ టైటిల్ ను సాధించింది. 2015లో ఈ టోర్నీకి సానియా దూరంగా ఉంది. -
ఫైనల్లో సానియా జంట
టోక్యో: ఈ ఏడాది ఎనిమిదో డబుల్స్ టైటిల్ సాధించేందుకు భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మరో విజయం దూరంలో నిలిచింది. పాన్ పసిఫిక్ ఓపెన్ టోర్నమెంట్లో తన చెక్ రిపబ్లిక్ భాగస్వామి బార్బరా స్ట్రికోవాతో కలిసి సానియా ఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన మహిళల డబుల్స్ సెమీఫైనల్లో సానియా-స్ట్రికోవా ద్వయం 4-6, 6-3, 10-5తో గాబ్రియెలా దబ్రౌస్కీ (కెనడా)-మరియా జోస్ మార్టినా శాంచెజ్ (స్పెయిన్) జోడీపై విజయం సాధించింది. అంతకుముందు జరిగిన క్వార్టర్ ఫైనల్లో సానియా-స్ట్రికోవా జంట 6-2, 6-2తో మియు కాటో (జపాన్)-యిఫాన్ జు (చైనా) ద్వయంపై నెగ్గింది. శనివారం జరిగే ఫైనల్లో చెన్ లియాంగ్-జావోజువాన్ యాంగ్ (చైనా) జోడీతో సానియా-స్ట్రికోవా జంట తలపడుతుంది. ఈ ఏడాది సానియా బ్రిస్బేన్, సిడ్నీ, ఆస్ట్రేలియన్ ఓపెన్, సెయింట్ పీటర్స్బర్గ్, రోమ్ (హింగిస్‌తో కలిసి)... సిన్సినాటి (స్ట్రికోవాతో), న్యూ హవెన్ (మోనికా నికులెస్కూతో) టోర్నమెంట్లలో విజేతగా నిలిచింది. -
క్వార్టర్స్‌లో సానియా జంట
టోక్యో: పాన్ పసిఫిక్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో రెండో సీడ్ సానియా మీర్జా (భారత్)-బార్బరా స్ట్రికోవా (చెక్ రిపబ్లిక్) జంట క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. మంగళవారం జరిగిన మహిళల డబుల్స్ తొలి రౌండ్లో సానియా-స్టిక్రోవా ద్వయం 6-7 (3/7), 7-5, 10-8తో మిసాకి డోయి-కురిమి నారా (జపాన్) జోడీపై కష్టపడి గెలిచింది. -
సానియా జోడీకి టైటిల్
పాన్ పసిఫిక్ ఓపెన్ టోక్యో: ప్రస్తుత సీజన్లో అద్వితీయ ఆటతీరును ప్రదర్శిస్తున్న సానియా మీర్జా పాన్ పసిఫిక్ ఓపెన్‌లోనూ మెరిసింది. జింబాబ్వేకు చెందిన కారా బ్లాక్‌తో కలిసి ఆమె డబుల్స్ టైటిల్‌ను నిలబెట్టుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో స్పెయిన్ జోడి గార్డిన్ ముగురుజా, కార్లా స్వారెజ్ నవారోపై 6-2, 7-5 తేడాతో సానియా ద్వయం నెగ్గింది. గంటా 15 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సానియా, బ్లాక్ ఏడు సార్లు ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేశారు. విజేతగా నిలిచిన సానియా జోడికి 44 వేల 835 డాలర్లు (రూ. 27 లక్షల 26 వేలు) ప్రైజ్‌మనీగా లభించింది. కెరీర్లో సానియాకిది 21వ డబుల్స్ టైటిల్‌కాగా... కారా బ్లాక్‌తో కలిసి నాలుగోది. తాజా విజయంతో సానియా ఆసియా క్రీడల్లో బరిలోకి దిగేందుకు ఇంచియాన్ బయలుదేరి వెళ్లనుంది. దివిజ్ శరణ్ లేదా సాకేత్‌లలో ఒకరితో కలిసి మిక్స్డ్ డబుల్స్‌లో ఆడనుంది.