సానియా జోడిదే టైటిల్ | Sania Mirza and Barbora Strycova win Pan Pacific Open title | Sakshi
Sakshi News home page

సానియా జోడిదే టైటిల్

Published Sat, Sep 24 2016 3:18 PM | Last Updated on Mon, Sep 4 2017 2:48 PM

సానియా జోడిదే టైటిల్

సానియా జోడిదే టైటిల్

టోక్యో: ఈ ఏడాది భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఖాతాలో ఎనిమిదో డబుల్స్ టైటిల్ చేరింది.  చెక్ రిపబ్లిక్ క్రీడాకారిణి బార్బరా స్ట్రికోవాతో కలిసి పాన్ పసిఫిక్ టోర్నమెంట్లో విజేతగా నిలిచింది. శనివారం జరిగిన తుది పోరులో సానియా ద్వయం 6-1, 6-1 తేడాతో చైనా జోడి చెన్ లియాంగ్-హవాన్ యంగ్ పై గెలిచి ట్రోఫీని కైవసం చేసుకుంది.

ఏకపక్షంగా సాగిన పోరులో సానియా ద్వయం వరుస సెట్లను చేజిక్కించుకుని విజయం సాధించింది.  గత నెల్లో సిన్సినాటి ఓపెన్ టైటిల్ ను గెలిచిన సానియా-స్ట్రికోవాల ద్వయం అదే ఊపును పాన్ ఫసిఫిక్ టోర్నీలో కనబరిచి రెండో టైటిల్ ను ముద్దాడింది. గత నాలుగు సంవత్సరాల్లో సానియాకు ఇది మూడో పాన్ పసిఫిక్ టైటిల్. అంతకుముందు 2013లో, 2014లో కారాబ్లేక్తో కలిసి సానియా ఈ టైటిల్ ను సాధించింది. 2015లో ఈ టోర్నీకి సానియా దూరంగా ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement