సానియా ‘అష్ట’ చమక్... | Sania Mirza-Barbora Strycova win Pan Pacific Open | Sakshi
Sakshi News home page

సానియా ‘అష్ట’ చమక్...

Published Sun, Sep 25 2016 12:12 AM | Last Updated on Mon, Sep 4 2017 2:48 PM

సానియా ‘అష్ట’ చమక్...

సానియా ‘అష్ట’ చమక్...

ఈ ఏడాది ఎనిమిదో డబుల్స్ టైటిల్ నెగ్గిన భారత టెన్నిస్ స్టార్
స్ట్రికోవాతో కలిసి పాన్ పసిఫిక్ ఓపెన్ టైటిల్ సొంతం 

టోక్యో: మార్టినా హింగిస్‌లాంటి విజయవంతమైన భాగస్వామితో విడిపోరుునా... భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తన విజయపరంపరను కొనసాగిస్తోంది. చెక్ రిపబ్లిక్‌కు చెందిన కొత్త భాగస్వామి బార్బరా స్ట్రికోవాతో కలిసి సానియా మీర్జా తాజాగా పాన్ పసిఫిక్ ఓపెన్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. శనివారం జరిగిన మహిళల డబుల్స్ ఫైనల్లో రెండో సీడ్ సానియా-స్ట్రికోవా ద్వయం 6-1, 6-1తో చెన్ లియాంగ్-జావోజువాన్ యాంగ్ (చైనా) జంటపై ఘనవిజయం సాధించింది.

ఈ ఏడాది సానియాకిది ఎనిమిదో టైటిల్ కావడం విశేషం. ఈ టోర్నీకి ముందు హింగిస్‌తో కలిసి బ్రిస్బేన్, సిడ్నీ, ఆస్ట్రేలియన్ ఓపెన్, సెరుుంట్ పీటర్స్‌బర్గ్, రోమ్ ఓపెన్‌లలో నెగ్గిన సానియా...స్ట్రికోవాతో సిన్సినాటి ఓపెన్, మోనికా నికులెస్కూ (రొమేనియా)తో న్యూ హవెన్ టైటిల్స్‌ను సాధించింది. ఓవరాల్‌గా సానియా కెరీర్‌లో ఇది 40వ డబుల్స్ టైటిల్.

అన్‌సీడెడ్ ద్వయం చెన్ లియాంగ్-జావోజువాన్ యాంగ్‌తో కేవలం 51 నిమిషాల్లో ముగిసిన ఫైనల్లో సానియా జంట తమ సర్వీస్‌ను ఒకసారి కోల్పోరుు, ప్రత్యర్థి సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేసింది. విజేతగా నిలిచిన సానియా జోడీకి 45,940 డాలర్ల (రూ. 30 లక్షల 64 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 470 ర్యాంకింగ్ పారుుంట్లు లభించారుు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement