Barbora Strycova
-
Barbora Strycova: టెన్నిస్‌కు స్ట్రికోవా గుడ్‌బై
ప్రాగ్ (చెక్ రిపబ్లిక్): మహిళల టెన్నిస్ డబుల్స్‌లో ప్రపంచ రెండో ర్యాంకర్ బార్బరా స్ట్రికోవా (చెక్ రిపబ్లిక్) కెరీర్‌కు వీడ్కోలు పలికింది. 35 ఏళ్ల స్ట్రికోవా తల్లి కాబోతున్నట్లు గత మార్చిలో ప్రకటించింది. 2019 వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో స్ట్రికోవా చైనీస్ తైపీకి చెందిన సు వె సెయితో కలిసి మహిళల డబుల్స్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. అదే ఏడాది సింగిల్స్ విభాగంలో సెమీఫైనల్‌కు చేరుకుంది. ‘నా అంతర్జాతీయ టెన్నిస్ కెరీర్‌కు వీడ్కోలు పలుకుతున్నాను. ప్రసవం జరిగాక పునరాగమనం చేస్తానని చెప్పడంలేదు. అయితే చివరిసారి అభిమానులతో మ్యాచ్ ఆడాలని ఉంది’ అని 2016 రియో ఒలింపిక్స్‌లో తన దేశానికే చెందిన లూసీ సఫరోవాతో కలిసి మహిళల డబుల్స్‌లో కాంస్య పతకాన్ని సాధించిన స్ట్రికోవా తెలిపింది. చివరిసారి ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఆడిన స్ట్రికోవా సింగిల్స్ విభాగంలో కెరీర్ బెస్ట్ 16వ ర్యాంక్ చేరుకోవడంతోపాటు రెండు టైటిల్స్‌ను గెలిచింది. డబుల్స్‌లో స్ట్రికోవా వరల్డ్ నంబర్‌వన్ ర్యాంక్‌లో నిలువడంతోపాటు 31 టైటిల్స్‌ను సొంతం చేసుకుంది. ఈ 31 టైటిల్స్‌లో రెండింటిలో (2016–సిన్సినాటి, టోక్యో ఓపెన్) భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా భాగస్వామిగా ఉంది. -
సానియా జంటకు షాక్
ఫ్లోరిడా (అమెరికా): ఈ ఏడాది రెండో డబుల్స్ టైటిల్ సాధించాలని ఆశించిన భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు నిరాశ ఎదురైంది. మయామి ఓపెన్ డబ్ల్యూటీఏ ప్రీమియర్ టోర్నమెంట్లో సానియా –బార్బరా స్ట్రికోవా (చెక్ రిపబ్లిక్) జంట రన్నరప్‌గా నిలిచింది. మహిళల డబుల్స్ ఫైనల్లో మూడో సీడ్ సానియా–స్ట్రికోవా జంట 4–6, 3–6తో అన్‌సీడెడ్ ద్వయం గాబ్రియెలా దబ్రోవ్‌స్కీ (కెనడా)–జు యిఫాన్ (చైనా) జంట చేతిలో ఓడింది. తొలిసారి జతగా ఆడిన తొలి టోర్నీలోనే దబ్రోవ్‌స్కీ–జు యిఫాన్ జోడీ టైటిల్ సాధించడం విశేషం. రన్నరప్‌గా నిలిచిన సానియా జోడీకి 1,87,970 డాలర్లు (రూ. కోటీ 22 లక్షలు)... విజేతగా నిలిచిన దబ్రోవ్‌స్కీ–జు యిఫాన్ జోడీకి 2,85,170 డాలర్లు (రూ. కోటీ 85 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. -
ప్రిక్వార్టర్స్‌లో సానియా జంట
ఫ్లోరిడా (అమెరికా): మయామి ఓపెన్ డబ్ల్యూటీఏ ప్రీమియర్ టెన్నిస్ టోర్నమెంట్లో సానియా మీర్జా (భారత్)–బార్బరా స్ట్రికోవా (చెక్ రిపబ్లిక్) జంట శుభారంభం చేసింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సానియా–స్ట్రికోవా ద్వయం 6–3, 7–6 (7/3)తో డెమీ షుర్స్ (నెదర్లాండ్స్)–రెనాటా వొరకోవా (చెక్ రిపబ్లిక్) జోడీపై గెలిచింది. 81 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సానియా ద్వయం తమ సర్వీస్‌ను ఐదుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి జంట సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేసింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో తిమియా బాబోస్ (హంగేరి)–అనస్తాసియా పావ్లీచెంకోవా (రష్యా) జోడీతో సానియా జంట ఆడుతుంది. -
సానియా ‘అష్ట’ చమక్...
♦ ఈ ఏడాది ఎనిమిదో డబుల్స్ టైటిల్ నెగ్గిన భారత టెన్నిస్ స్టార్ ♦ స్ట్రికోవాతో కలిసి పాన్ పసిఫిక్ ఓపెన్ టైటిల్ సొంతం టోక్యో: మార్టినా హింగిస్లాంటి విజయవంతమైన భాగస్వామితో విడిపోరుునా... భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తన విజయపరంపరను కొనసాగిస్తోంది. చెక్ రిపబ్లిక్కు చెందిన కొత్త భాగస్వామి బార్బరా స్ట్రికోవాతో కలిసి సానియా మీర్జా తాజాగా పాన్ పసిఫిక్ ఓపెన్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. శనివారం జరిగిన మహిళల డబుల్స్ ఫైనల్లో రెండో సీడ్ సానియా-స్ట్రికోవా ద్వయం 6-1, 6-1తో చెన్ లియాంగ్-జావోజువాన్ యాంగ్ (చైనా) జంటపై ఘనవిజయం సాధించింది. ఈ ఏడాది సానియాకిది ఎనిమిదో టైటిల్ కావడం విశేషం. ఈ టోర్నీకి ముందు హింగిస్‌తో కలిసి బ్రిస్బేన్, సిడ్నీ, ఆస్ట్రేలియన్ ఓపెన్, సెరుుంట్ పీటర్స్బర్గ్, రోమ్ ఓపెన్లలో నెగ్గిన సానియా...స్ట్రికోవాతో సిన్సినాటి ఓపెన్, మోనికా నికులెస్కూ (రొమేనియా)తో న్యూ హవెన్ టైటిల్స్‌ను సాధించింది. ఓవరాల్‌గా సానియా కెరీర్లో ఇది 40వ డబుల్స్ టైటిల్. అన్‌సీడెడ్ ద్వయం చెన్ లియాంగ్-జావోజువాన్ యాంగ్తో కేవలం 51 నిమిషాల్లో ముగిసిన ఫైనల్లో సానియా జంట తమ సర్వీస్‌ను ఒకసారి కోల్పోరుు, ప్రత్యర్థి సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేసింది. విజేతగా నిలిచిన సానియా జోడీకి 45,940 డాలర్ల (రూ. 30 లక్షల 64 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 470 ర్యాంకింగ్ పారుుంట్లు లభించారుు. -
సానియా జోడిదే టైటిల్
టోక్యో: ఈ ఏడాది భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఖాతాలో ఎనిమిదో డబుల్స్ టైటిల్ చేరింది. చెక్ రిపబ్లిక్ క్రీడాకారిణి బార్బరా స్ట్రికోవాతో కలిసి పాన్ పసిఫిక్ టోర్నమెంట్లో విజేతగా నిలిచింది. శనివారం జరిగిన తుది పోరులో సానియా ద్వయం 6-1, 6-1 తేడాతో చైనా జోడి చెన్ లియాంగ్-హవాన్ యంగ్ పై గెలిచి ట్రోఫీని కైవసం చేసుకుంది. ఏకపక్షంగా సాగిన పోరులో సానియా ద్వయం వరుస సెట్లను చేజిక్కించుకుని విజయం సాధించింది. గత నెల్లో సిన్సినాటి ఓపెన్ టైటిల్ ను గెలిచిన సానియా-స్ట్రికోవాల ద్వయం అదే ఊపును పాన్ ఫసిఫిక్ టోర్నీలో కనబరిచి రెండో టైటిల్ ను ముద్దాడింది. గత నాలుగు సంవత్సరాల్లో సానియాకు ఇది మూడో పాన్ పసిఫిక్ టైటిల్. అంతకుముందు 2013లో, 2014లో కారాబ్లేక్తో కలిసి సానియా ఈ టైటిల్ ను సాధించింది. 2015లో ఈ టోర్నీకి సానియా దూరంగా ఉంది.