పూజా హెగ్డే
‘‘అనుకున్నవన్నీ అనుకున్న వెంటనే అయిపోవు. కొన్నిసార్లు ఒకటికి రెండు మూడుసార్లు ప్రయత్నించాల్సి ఉంటుంది. ఆ ప్రయత్నం చాలా పట్టుదలగా, అంకితభావంతో ఉండాలి. జరగట్లేదని వదిలేయకుండా ఒక చాలెంజ్‌గా తీసుకుంటేనే మనం సక్సెస్ అవ్వగలం’’ అంటున్నారు పూజా హెగ్డే. ఈ విషయం గురించి ఆమె ఇంకా వివరంగా మాట్లాడుతూ– ‘‘స్కూల్‌లో టామ్‌బాయ్‌లా ఉండేదాన్ని. షార్ట్ హెయిర్‌తో, స్నీకర్ షూ వేసుకొని తిరిగేదాన్ని.
ఎక్కువగా సోషల్‌గా మూవ్ అయ్యేదాన్ని కాదు. నా లోకంలో నేను ఉండేదాన్ని. బట్ 15 ఏళ్లు వచ్చాక మనం ఇలా ఉండకూడదు. మారాలి అని గట్టిగా అనుకున్నాను. చాలెంజ్‌గా తీసుకున్నాను. కాలేజ్‌లో జాయిన్ అయ్యాక కాలేజ్‌లో జరిగిన ప్రతి ఫంక్షన్‌లో, ఫెస్ట్‌లో పాల్గొనేదాన్ని. నా సిగ్గుని, మొహమాటాన్ని పోగొట్టడానికి ఇవి ఉపయోగపడ్డాయి. ఆ తర్వాత ఓసారి మాధురీ దీక్షిత్ ‘ఆజా నాచ్‌లే’ షోలో డ్యాన్స్ చేయాలంటే కాళ్లు చేతులు ఆడలేదు. అంతమంది ఆడియన్స్‌ని ఎదురుగా చూడగానే ఫ్రీజ్ అయిపోయాను.
బట్ వెంటనే ఇలాంటి సిచ్యువేషన్స్‌నే మనం చాలెంజ్‌గా తీసుకోవాలి కదా అని ముందు దూసుకువెళ్లాను. డ్యాన్స్ చేశాను. ఆ తర్వాత మిస్ ఇండియా కాంపిటీషన్‌లో ఫస్ట్ టైమ్ నా అప్లికేషన్‌ను రిజెక్ట్ చేశారు. అలా జరిగిందని నేను డిజప్పాయింట్ అవ్వలేదు. చాలెంజ్‌గా తీసుకున్నాను. 2010లో మళ్లీ ట్రై చేశాను. ఈసారి మిస్ యూనివర్స్ కాంపిటేషన్‌లో రన్నరప్‌గా నిలిచాను. సో.. ఏదైనా పని జరగట్లేదని డిజప్పాయింట్ అవ్వకండి. చాలెంజ్‌గా తీసుకోండి. సక్సెస్ వస్తుంది’’ అని పేర్కొన్నారు పూజా.
Comments
Please login to add a commentAdd a comment