మాడ్రిడ్: ఈ ఏడాది ఫైనల్ చేరిన తొలి టోర్నీలో విజేతగా నిలిచి తొలి టైటిల్ సాధించాలని ఆశించిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధుకు నిరాశ ఎదురైంది. స్పెయిన్ మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–300 టోర్నీలో ప్రపంచ 11వ ర్యాంకర్ సింధు రన్నరప్‌గా నిలిచింది.
ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ 12వ ర్యాంకర్ గ్రెగోరియా మరిస్కా తున్‌జంగ్ (ఇండోనేసియా) కేవలం 29 నిమిషాల్లో 21–8, 21–8తో సింధును ఓడించి టైటిల్ సొంతం చేసుకుంది. గతంలో సింధుతో ఆడిన ఏడుసార్లూ ఓడిపోయిన మరిస్కా ఎనిమిదో ప్రయత్నంలో తొలిసారి గెలుపొందడం విశేషం. ఫైనల్లో సింధు ఏదశలోనూ మరిస్కాకు పోటీనివ్వలేకపోయింది. విన్నర్ మరిస్కాకు 15,750 డాలర్లు (రూ. 12 లక్షల 93 వేలు), రన్నరప్ సింధుకు 7,980 డాలర్లు (రూ. 6 లక్షల 55 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి.
Comments
Please login to add a commentAdd a comment