Madrid Open tennis tournament
-
Madrid Open: కొనసాగుతున్న అల్కరాజ్ హవా.. ఈ ఏడాది నాలుగో టైటిల్
మాడ్రిడ్: ఈ ఏడాది తన జోరు కొనసాగిస్తూ స్పెయిన్ టెన్నిస్ స్టార్ కార్లోస్ అల్కరాజ్ నాలుగో టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. మాడ్రిడ్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్ టోర్నీలో 20 ఏళ్ల అల్కరాజ్ వరుసగా రెండో ఏడాది చాంపియన్‌గా నిలిచాడు. జాన్ లెనార్డ్ స్ట్రఫ్ (జర్మనీ)తో జరిగిన ఫైనల్లో అల్కరాజ్ 6–4, 3–6 6–3తో గెలిచాడు. విజేతగా నిలిచిన అల్కరాజ్కు 11,05,265 యూరోల (రూ. 10 కోట్ల 12 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 1000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. రాఫెల్ నాదల్ (స్పెయిన్) తర్వాత ఈ టోర్నీ చరిత్రలో వరుసగా రెండేళ్లు టైటిల్ నెగ్గిన రెండో ప్లేయర్‌గా అల్కరాజ్ గుర్తింపు పొందాడు. ఈ విజయంతో ప్రపంచ ర్యాంకింగ్స్‌లో రెండో ర్యాంక్‌లో ఉన్న అల్కరాజ్ రోమ్ ఓపెన్‌లో బరిలోకి దిగితే మళ్లీ ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను సొంతం చేసుకుంటాడు. -
Madrid Open: రన్నరప్‌గా బోపన్న జోడి
మాడ్రిడ్: ఏటీపీ మాస్టర్స్ 1000 టెన్నిస్ టోర్నీ మాడ్రిడ్ ఓపెన్‌లో టైటిల్ సాధించేందుకు బరిలోకి దిగిన భారత ఆటగాడు రోహ న్ బోపన్నకు నిరాశే ఎదురైంది. శనివారం జరిగిన ఫైనల్లో ఏడో సీడ్ బోపన్న – మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా) జోడి ఓటమిపాలైంది. డబుల్స్‌లో జత కట్టిన సింగిల్స్ స్పెషలిస్ట్‌లు, రష్యాకు చెందిన కరెన్ ఖచనోవ్ – ఆండ్రీ రుబ్లెవ్ 6–3, 3–6, 10–3 స్కోరుతో బోపన్న – ఎబ్డెన్పై విజయం సాధించారు. 69 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో బోపన్న – ఎబ్డెన్ ద్వయం 4 ఏస్‌లు సంధించగా, రష్యా జంట 3 ఏస్‌లు కొట్టింది. -
Spain Masters 2023 Final: సింధుకు నిరాశ
మాడ్రిడ్: ఈ ఏడాది ఫైనల్ చేరిన తొలి టోర్నీలో విజేతగా నిలిచి తొలి టైటిల్ సాధించాలని ఆశించిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధుకు నిరాశ ఎదురైంది. స్పెయిన్ మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–300 టోర్నీలో ప్రపంచ 11వ ర్యాంకర్ సింధు రన్నరప్‌గా నిలిచింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ 12వ ర్యాంకర్ గ్రెగోరియా మరిస్కా తున్‌జంగ్ (ఇండోనేసియా) కేవలం 29 నిమిషాల్లో 21–8, 21–8తో సింధును ఓడించి టైటిల్ సొంతం చేసుకుంది. గతంలో సింధుతో ఆడిన ఏడుసార్లూ ఓడిపోయిన మరిస్కా ఎనిమిదో ప్రయత్నంలో తొలిసారి గెలుపొందడం విశేషం. ఫైనల్లో సింధు ఏదశలోనూ మరిస్కాకు పోటీనివ్వలేకపోయింది. విన్నర్ మరిస్కాకు 15,750 డాలర్లు (రూ. 12 లక్షల 93 వేలు), రన్నరప్ సింధుకు 7,980 డాలర్లు (రూ. 6 లక్షల 55 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. -
దిగ్గజాలకు షాకిచ్చి చరిత్ర సృష్టించిన టెన్నిస్ యువ కెరటం
మాడ్రిడ్: స్పెయిన్ యువ టెన్నిస్ క్రీడాకారుడు కార్లోస్ అల్కరాజ్ (19) మాడ్రిడ్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్1000 టైటిల్‌ను నెగ్గి చరిత్ర సృష్టించాడు. క్వార్టర్స్‌లో తన ఆరాధ్య ఆటగాడు రఫెల్ నదాల్‌ను, సెమీస్‌లో టాప్ ర్యాంకర్ నొవాక్ జొకోవిచ్‌లను ఓడించిన ఈ యువ సంచలనం.. ఫైనల్లో 6-3, 6-1తో డిఫెండింగ్ ఛాంపియన్, వరల్డ్ నంబర్ 3 ఆటగాడు అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ)ను చిత్తు చేసి సీజన్లో నాలుగో టైటిల్‌ను ఎగురేసుకుపోయాడు. ఈ క్రమంలో అల్కరాజ్ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఒకే సీజన్లో నదాల్ (2005) తర్వాత రెండు మాస్టర్స్ 1000 టైటిళ్లు నెగ్గిన రెండో అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డుల్లోకెక్కాడు. అల్కరాజ్ ఇప్పటికే టాప్ 10లోకి ప్రవేశించిన అతి పిన్న వయస్కుడిగా కూడా రికార్డుల్లో నిలిచాడు. మాడ్రిడ్ ఓపెన్‌లో విజయం సాధించిన అనంతరం జ్వెరెవ్.. అల్కరాజ్పై ప్రశంసల వర్షం కురిపించాడు. అల్కరాజ్ను భవిష్యత్తు సూపర్ స్టార్‌గా అభివర్ణించాడు. చిన్న వయసులోనే దిగ్గజాలందరికీ ముచ్చెమటలు పట్టిస్తున్న అల్కరాజ్.. మున్ముందు అనేక గ్రాండ్ స్లామ్‌లు సాధించాలని ఆకాంక్షించాడు. చదవండి: గుకేశ్ ఖాతాలో ‘హ్యాట్రిక్’ టైటిల్ -
మాడ్రిడ్ ఓపెన్ ‘మాస్టర్’ నొవాక్ జొకోవిచ్
ప్రపంచ నంబర్‌వన్ ర్యాంకర్ నొవాక్ జొకోవిచ్ మాడ్రిడ్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 క్లే కోర్టు టోర్నీలో మూడో సారి చాంపియన్‌గా నిలిచాడు. గ్రీస్ యువతార సిట్సిపాస్‌తో జరిగిన ఫైనల్లో జొకోవిచ్ 6–4, 6–4తో గెలిచాడు. విజేత జొకోవిచ్‌కు 12,02,520 యూరోల (రూ. 9 కోట్ల 45 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 1000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. జొకోవిచ్ కెరీర్లో ఇది 33వ మాస్టర్స్ సిరీస్ టైటిల్. ఈ విజయంతో అత్యధిక మాస్టర్స్ సిరీస్ టైటిల్స్ నెగ్గిన ప్లేయర్‌గా రాఫెల్ నాదల్ (స్పెయిన్) పేరిట ఉన్న రికార్డును జొకోవిచ్ సమం చేశాడు. -
క్వార్టర్స్‌లో సానియా జంట
మాడ్రిడ్: మహిళల డబుల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్ జంట సానియా మీర్జా (భారత్)-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) మాడ్రిడ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. మంగళవారం జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌లో సానియా-హింగిస్ జోడీ 6-0, 6-4తో చియా జంగ్ చువాంగ్ (చైనీస్ తైపీ) -దరియా జురాక్ (క్రొయేషియా) జంటపై గెలిచింది. -
సెమీస్‌లో బోపన్న జంట
సానియా జోడీకి షాక్ న్యూఢిల్లీ : మాడ్రిడ్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్ టెన్నిస్ టోర్నమెంట్లో రోహన్ బోపన్న (భారత్)-ఫ్లోరియన్ మెర్జియా (రుమేనియా) జంట సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో బోపన్న-మెర్జియా ద్వయం 6-3, 6-2తో అడ్రియన్ మనారినో (ఫ్రాన్స్)-సెబాస్టియన్ కాబెల్ (కొలంబియా) జంటపై గెలిచింది. గురువారం జరిగిన రెండో రౌండ్లో బోపన్న-మెర్జియా 6-4, 4-6, 10-5తో రోజర్ వాసెలిన్-నికొలస్ మహుట్ (ఫ్రాన్స్)లపై విజయం సాధించారు. అయితే లియాండర్ పేస్ (భారత్)-డానియల్ నెస్టర్ (కెనడా) జోడీకి రెండో రౌండ్లో ఓటమి ఎదురైంది. పేస్-నెస్టర్ జంట 6-7 (4/7), 3-6తో ఫెలిసియానో లోపెజ్ (స్పెయిన్)-మాక్స్ మిర్నీ (బెలారస్) ద్వయం చేతిలో పరాజయం పాలైంది. ఇదే టోర్నీ మహిళల డబుల్స్ విభాగంలో భారత స్టార్ సానియా మీర్జా పోరాటం ముగిసింది. క్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ సానియా మీర్జా-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) ద్వయం 7-6 (7/5), 3-6, 9-11తో బెథానీ మాటెక్ (అమెరికా)-లూసీ సఫరోవా (చెక్ రిపబ్లిక్) జంట చేతిలో ఓడింది. ఈ సీజన్లో సానియా జంటకిది రెండో ఓటమి.