సానియా జోడీకి షాక్
న్యూఢిల్లీ : మాడ్రిడ్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్ టెన్నిస్ టోర్నమెంట్‌లో రోహన్ బోపన్న (భారత్)-ఫ్లోరియన్ మెర్జియా (రుమేనియా) జంట సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో బోపన్న-మెర్జియా ద్వయం 6-3, 6-2తో అడ్రియన్ మనారినో (ఫ్రాన్స్)-సెబాస్టియన్ కాబెల్ (కొలంబియా) జంటపై గెలిచింది.
గురువారం జరిగిన రెండో రౌండ్‌లో బోపన్న-మెర్జియా 6-4, 4-6, 10-5తో రోజర్ వాసెలిన్-నికొలస్ మహుట్ (ఫ్రాన్స్)లపై విజయం సాధించారు. అయితే లియాండర్ పేస్ (భారత్)-డానియల్ నెస్టర్ (కెనడా) జోడీకి రెండో రౌండ్‌లో ఓటమి ఎదురైంది. పేస్-నెస్టర్ జంట 6-7 (4/7), 3-6తో ఫెలిసియానో లోపెజ్ (స్పెయిన్)-మాక్స్ మిర్నీ (బెలారస్) ద్వయం చేతిలో పరాజయం పాలైంది.
ఇదే టోర్నీ మహిళల డబుల్స్ విభాగంలో భారత స్టార్ సానియా మీర్జా పోరాటం ముగిసింది. క్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ సానియా మీర్జా-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) ద్వయం 7-6 (7/5), 3-6, 9-11తో బెథానీ మాటెక్ (అమెరికా)-లూసీ సఫరోవా (చెక్ రిపబ్లిక్) జంట చేతిలో ఓడింది. ఈ సీజన్‌లో సానియా జంటకిది రెండో ఓటమి.
సెమీస్‌లో బోపన్న జంట
Published Sat, May 9 2015 1:35 AM | Last Updated on Sun, Sep 3 2017 1:40 AM
Advertisement
Advertisement