మాడ్రిడ్: ఈ ఏడాది తన జోరు కొనసాగిస్తూ స్పెయిన్ టెన్నిస్ స్టార్ కార్లోస్ అల్‌కరాజ్ నాలుగో టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. మాడ్రిడ్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్ టోర్నీలో 20 ఏళ్ల అల్‌కరాజ్ వరుసగా రెండో ఏడాది చాంపియన్‌గా నిలిచాడు. జాన్ లెనార్డ్ స్ట్రఫ్ (జర్మనీ)తో జరిగిన ఫైనల్లో అల్‌కరాజ్ 6–4, 3–6 6–3తో గెలిచాడు. విజేతగా నిలిచిన అల్‌కరాజ్‌కు 11,05,265 యూరోల (రూ. 10 కోట్ల 12 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 1000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.
రాఫెల్ నాదల్ (స్పెయిన్) తర్వాత ఈ టోర్నీ చరిత్రలో వరుసగా రెండేళ్లు టైటిల్ నెగ్గిన రెండో ప్లేయర్‌గా అల్‌కరాజ్ గుర్తింపు పొందాడు. ఈ విజయంతో ప్రపంచ ర్యాంకింగ్స్‌లో రెండో ర్యాంక్‌లో ఉన్న అల్‌కరాజ్ రోమ్ ఓపెన్‌లో బరిలోకి దిగితే మళ్లీ ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను సొంతం చేసుకుంటాడు.
Comments
Please login to add a commentAdd a comment