Shannu Shocking Comments On Relationship With Siri: యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్.. అదే క్రేజ్‌తో బిగ్‌బాస్ సీజన్-5లో ఎంట్రీ ఇచ్చి టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగాడు. మొదట్లో బాగానే ఉన్నా తర్వాత సిరితో రిలేషన్, పదేపదే హగ్గులతో విపరీతమైన నెగిటివిటీ మూటగట్టుకున్నాడు. హగ్గులు నచ్చడం లేదని స్వయంగా సిరి తల్లి వచ్చి చెప్పినా ఇద్దరూ తీరు మార్చుకోలేదు. పదేపదే ఫ్రెండిష్ హగ్గంటూ శృతిమించి ప్రవర్తించారు. దీంతో సోషల్‌మీడియాలో వీరిద్దరూ విపరీతంగా ట్రోల్స్ బారిన పడ్డారు.
షణ్నూతో ఫ్రెండిష్ సిరికి ఓటింగ్ విషయంలో కాస్త కలిసి వచ్చినా షణ్నూకి మాత్రం బాగా దెబ్బతీసింది. సిరితో రిలేషన్ వల్లే విన్నర్ అవ్వాల్సిన షణ్నూ..రన్నరప్ అయ్యాడనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. తాజాగా ఇదే విషయాన్ని బిగ్‌బాస్ బజ్ ఇంటర్వ్యూలో అరియానా ప్రశ్నించగా ఫణ్నై సైతం అంగీకరించడం విశేషం.
సిరితో కనెక్ట్ కావడం వల్లే రన్నరప్‌గా బయటకు వచ్చాను అని అనుకుంటున్నారా అని అరియానా ప్రశ్నించగా.. అదే జరిగింది అంటూ తన మనసులో మాటను బయటపెట్టేశాడు. సిరితో రిలేషన్ వల్ల టైటిల్ కోల్పోతానని తనకి ముందే తెలిసినా తన ఎమోషన్స్‌ని ఫేక్ చేయలేనని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతుంది.
చదవండి: షణ్నూ చాలా స్పెషల్, బయట కూడా అలాగే ఉంటాం: సిరి
సిరికి చుక్కలు చూపించిన అరియానా.. ప్రతి ప్రశ్నలో కౌంటర్ అటాక్
Comments
Please login to add a commentAdd a comment