Shanmukh Jaswanth Announced Agent Anand Santhosh, Siri Announce BFF - Sakshi
Sakshi News home page

Shanmukh Jaswanth, Siri Hanmanth: అభిమానులకు గుడ్‌న్యూస్‌ చెప్పిన షణ్ముఖ్‌, సిరి

Published Sat, May 14 2022 8:14 PM | Last Updated on Sun, May 15 2022 9:09 AM

Shanmukh Jaswanth Announced Agent Anand Santhosh, Siri Announce BFF - Sakshi

సిరి హన్మంత్‌, షణ్ముఖ్‌ జశ్వంత్‌.. బిగ్‌బాస్‌ షో వల్ల వీరి ఇమేజ్‌ డ్యామేజ్‌ అయిందనుకున్నారంతా.. సోషల్‌ మీడియాలో నెగెటివిటీ వల్ల సిరి కొన్నాళ్లపాటు డిప్రెషన్‌లోకి వెళ్లిపోగా షణ్ముఖ్‌కు దీప్తి సునయనతో బ్రేకప్‌ అయింది. ఈ అనూహ్య పరిణామాలతో కొంతకాలంపాటు వార్తల్లో నిలిచారిద్దరూ. కానీ తమ టాలెంట్‌తో నెగెటివ్‌ కామెంట్లు చేసేవారి నోరు మూయించారిద్దరూ. ఇటీవలే సిరి హన్మంత్‌ బీఎఫ్‌ఎఫ్‌ వెబ్‌ సిరీస్‌ చేస్తున్నట్లు వెల్లడించగా తాజాగా షణ్ముఖ్‌ జశ్వంత్‌ ఏజెంట్‌ ఆనంద్‌ సంతోష్‌ సిరీస్‌ చేస్తున్నట్లు ప్రకటించాడు.

ఈమేరకు ఫస్ట్‌లుక్‌ కూడా విడుదలైంది. ఇన్వెస్టిగేషన్‌ త్వరలో ప్రారంభమవుతుందని, కేస్‌ వివరాలను త్వరలో ప్రకటించనున్నట్లు వెల్లడించాడు. అటు బీఎఫ్‌ఎఫ్‌, ఏజెంట్‌ ఆనంద్‌ సంతోష్‌.. ఈ రెండూ కూడా తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఆహాలో ప్రసారం కానున్నాయి. మొత్తానికి వారు పంచుకున్న గుడ్‌న్యూస్‌ విని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

చదవండి: 'సర్కారు వారి పాట'ను వీక్షించిన నమ్రతా శిరోద్కర్.. ఫుల్‌ జోష్‌లో ఫ్యాన్స్‌

పాన్‌ ఇండియా సినిమాలు చూసుంటారు, పాన్‌ ఇండియా రౌడీలను చూశారా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement