
Actress Madhavi Latha Shocking Comments on Bigg Boss Telugu 5 Show: బుల్లితెరపై బిగ్‌బాస్ షోకు ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టెలివిజన్ తెరపై టాప్ టీఆర్పీ రేటింగులతో దూసుకుపోతుంది ఈ షో. ఇక మిగతా భాషల్లో మాదిరిగానే తెలుగు బిగ్‌బాస్ షోలో సైతం లవ్ ట్రాక్‌లు కామనే. రీసెంట్‌గా షణ్నూ-సిరిల వ్యవహారశైలిపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇద్దరూ బయట వేరేవాళ్లతో రిలేషన్ షిప్‌లో ఉన్నప్పటికీ హౌస్‌లో మాత్రం బాగా కనెక్ట్ అయిపోయారు.
జెస్సీ వెళ్లిపోయాక వీరిద్దరి బంధం మరింత బలపడింది. ఎమోషనల్‌గా బాగా కనెక్ట్ అయిపోతున్నాం అంటూనే దూరంగా ఉండలేకపోతున్నారు. తాజాగా బిగ్‌బాస్ షోలో జరుగుతున్న పరిణామాలపై నటి మాధవీలత సోషల్ మీడియాలో వరుస కామెంట్లు చేస్తుంది. బిగ్‌బాస్ హౌస్ లవర్స్ అడ్డాగా మారిందని ఫైర్ అయ్యింది.
'బిగ్ బాస్‌లో రగులుతోంది మొగలిపొద సీన్స్ జరిగాయి..ఆ వీడియోలు, ఫోటోలు నా దగ్గరకు వచ్చాయి. కానీ వాటిని పబ్లిష్ చేయడం కల్చర్ కాదు' అంటూ మరో సంచలనానికి తెరదీసింది. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో మాధవీలత చేసిన ఈ కామెంట్స్ తెగ వైరల్ అవుతున్నాయి. టెలికాస్ట్ కాని కంటెంట్ ఉందంటే..హౌస్‌లో ఇంకెన్ని దారుణాలు జరుగుతున్నాయో అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.