రన్నరప్ శ్రీనివాస్ | srinivas stands in runner up position in carrom championship | Sakshi
Sakshi News home page

రన్నరప్ శ్రీనివాస్

Published Sat, Mar 15 2014 12:01 AM | Last Updated on Thu, Sep 19 2019 2:50 PM

srinivas stands in runner up position in carrom championship

విశాఖపట్నం, న్యూస్‌లైన్: జాతీయ ఇంటర్ స్టేట్ క్యారమ్ చాంపియన్‌షిప్ పురుషుల విభాగంలో కె.శ్రీనివాస్ రన్నరప్‌గా నిలిచాడు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన శ్రీనివాస్ పీఎస్‌పీబీకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. స్థానిక కేపీఆర్ కన్వెన్షన్ సెంటర్‌లో శుక్రవారం జరిగిన ఫైనల్లో శ్రీనివాస్ 10-23, 15-11, 10-20తో యోగేశ్ డోంగ్రే (విదర్భ) చేతిలో పరాజయం పొందాడు. మూడో స్థానం కోసం జరిగిన పోటీలో రియాజ్ అక్బర్ అలీ (ఎయిరిండియా) 25-10, 10-25, 25-2తో ఎండీ గుఫ్రాన్ (ఎయిరిండియా)పై విజయం సాధించాడు. మహిళల విభాగం ఫైనల్లో రష్మీ కుమారి (పీఎస్‌పీబీ) 19-12, 24-2తో వినీత (పీఎస్‌పీబీ)పై నెగ్గి టైటిల్ దక్కించుకుంది. మూడో స్థానం కోసం జరిగిన పోరులో కవిత సోమంచి (ఆర్‌బీఐ) 22-25, 25-22, 25-14తో తూబా సెహర్‌పై గెలిచింది.
 
 వెటరన్ పురుషుల విభాగంలో బాలకోటయ్య (తమిళనాడు) 16-23, 25-12తో బాబులాల్ శ్రీమల్ (మహారాష్ట్ర)పై నెగ్గి టైటిల్ సాధించాడు. మూడో స్థానం కోసం జరిగిన పోటీలో నరేష్ రాథోడ్ (ఎంపీఎస్‌సీబీ) జేఐకు చెందిన అన్సార్ సలీం అక్బర్‌పై గెలుపొందాడు. వెటరన్ మహిళల విభాగం ఫైనల్లో శోభా కామత్ (మహారాష్ట్ర) 25-10, 24-4తో ప్రభా నాయుడు (చండీగఢ్)ను ఓడించి ప్రథమ స్థానంలో నిలిచింది. మరోవైపు పార్వతి రమాభట్ (కర్ణాటక) 25-0, 24-4తో వీఎస్ దేశ్‌కర్ (ఆర్‌బీఐ)పై నెగ్గి మూడో స్థానంలో నిలిచింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement