రన్నరప్‌ ప్రజ్నేశ్‌ | Prajnesh Gunneswaran Ends Runner-up at Ningbo Challenger | Sakshi
Sakshi News home page

రన్నరప్‌ ప్రజ్నేశ్‌

Published Mon, Oct 22 2018 5:10 AM | Last Updated on Mon, Oct 22 2018 5:10 AM

Prajnesh Gunneswaran Ends Runner-up at Ningbo Challenger - Sakshi

ప్రజ్నేశ్‌ గుణేశ్వరన్‌

న్యూఢిల్లీ: నింగ్బో ఓపెన్‌ ఏటీపీ చాలెంజర్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో భారత ఆటగాడు ప్రజ్నేశ్‌ గుణేశ్వరన్‌ రన్నరప్‌గా నిలిచాడు. చైనాలో ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో ప్రపంచ 170వ ర్యాంకర్‌ ప్రజ్నేశ్‌ 6–7 (4/7), 6–4, 3–6తో ప్రపంచ 131వ ర్యాంకర్‌ థామస్‌ ఫాబియానో (ఇటలీ) చేతిలో ఓడిపోయాడు. 2 గంటల 54 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రజ్నేశ్‌ తొలి సెట్‌లో ఎనిమిది బ్రేక్‌ పాయింట్లను వృథా చేసుకోవడం గమనార్హం. రన్నరప్‌ ప్రజ్నేశ్‌కు 12,720 డాలర్ల (రూ. 9 లక్షల 32 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 65 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement