టాలీవుడ్ స్టార్ జంట జీవిత- రాజశేఖర్‌ల కూతుర్లిద్దరూ వెండితెరపై హీరోయిన్లుగా రాణిస్తున్నారు. కొత్త కొత్త కాన్సెప్టులను ఎంచుకుంటూ ఆచితూచి ముందడుగు వేస్తున్నారు. శివానీ రాజశేఖర్ ఈ మధ్యే కోటబొమ్మాళి పీఎస్ సినిమాతో హిట్ అందుకుంది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో తండ్రి గురించి చెప్తూ ఎమోషనల్ అయింది. 'www సినిమా షూటింగ్‌లో నాకు కరోనా సోకింది. అంతలోనే ఇంట్లో అందరికీ వ్యాపించింది. నేను త్వరగానే కోలుకున్నాను. అమ్మ, చెల్లికి కూడా కొద్ది రోజుల్లోనే తగ్గిపోయింది.
నా వల్ల కుటుంబానికి గండం!
కానీ నాన్నకు మాత్రం సీరియస్ అయింది. వెంటిలేటర్ వరకు వెళ్లి వచ్చాడు. నాన్నకు నా వల్ల కరోనా రావడంతో నా జాతకం బాలేదని, నా వల్ల కుటుంబానికి గండం ఉందని చాలామంది ఏవేవో మాటలు చెప్పారు. మొదట నేను పట్టించుకోలేదు. కానీ ఎప్పుడైతే నాన్న వెంటిలేటర్‌పైకి వెళ్లాడో అప్పుడు చాలా బాధపడ్డాను. నా వల్లే ఇదంతా జరుగుతుందేమో.. ఇంటికి నేనే దరిద్రం ఏమో.. నా జాతకంలో ఏదైనా దోషం ఉందేమో, నా వల్ల మా నాన్నకు ఏమవుతుందోనని భయపోడిపోయాను.
నాకు అనారోగ్య సమస్య
అప్పుడు నాకు ఓ అనారోగ్య సమస్య ఉండేది. దానివల్ల ఉన్నట్లుండి గుండెదడ ఎక్కువయ్యేది. గుండెచప్పుడు సడన్‌గా 170-200 వరకు వెళ్లేది. నాన్న డాక్టర్ కాబట్టి గుండె దడ మొదలవగానే మందులు ఇచ్చేవాడు. అది నెలకోసారి వచ్చిపోతూ ఉండేది. నాన్నకు కరోనా వచ్చినప్పటి నుంచి ప్రతిరోజూ రెండుమూడుసార్లు గుండెదడ వచ్చేది. నాన్న పక్కనే ఐసీయూ బెడ్‌లో నిద్రపోయేదాన్ని. ఒకరోజు అతడి పరిస్థితి మరీ సీరియస్ అయింది.
ప్రార్థనలే బతికించాయి
అందరూ ప్రార్థించండి, ఇక అదే మిగిలింది అని పేపర్ మీద రాశాడు. నీకేమైనా అయితే నేను కూడా చనిపోతాను.. నువ్వు పోరాడు అని చెప్పాను. ఆయన్ని అభిమానుల ప్రార్థనలే బతికించాయి' అని చెప్పుకొచ్చింది. ఉప్పెన సినిమాను చేజార్చుకోవడంపై స్పందిస్తూ.. 'ఉప్పెన సినిమాలో హీరోయిన్‌గా ఛాన్స్ వచ్చింది. కానీ ముద్దు సన్నివేశాలు ఎక్కువగా ఉండటంతో చేయనని చెప్పాను. కానీ నాకు చెప్పిన కథకు, సినిమా ఫైనల్ అవుట్‌పుట్‌కు చాలా తేడా ఉంది' అని తెలిపింది శివానీ రాజశేఖర్.
చదవండి: తెలుగులో హీరోయిన్‌గా, పనిమనిషిగా నటించిన బ్యూటీ.. కొట్టి మరీ ఏడిపించారు.. గుర్తుపట్టారా?
Comments
Please login to add a commentAdd a comment