
జీవిత- రాజశేఖర్.. ఇద్దరూ సినిమా ఇండస్ట్రీలో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఈ దంపతుల కూతుర్లు శివాని, శివాత్మికలు పేరెంట్స్ అడుగుజాడల్లో నడుస్తూ తెలుగు చలనచిత్రపరిశ్రమలో క్లిక్కయ్యారు. ఫెమినా మిస్ ఇండియా 2022 పోటీలో ఫైనలిస్టుగా నిలిచిన శివాని అద్భుతం మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.
టూ స్టేట్స్, www, శేఖర్, జిలేబి, కోట బొమ్మాళి పీఎస్ సినిమాలతో అలరించింది. శివాత్మిక అక్క కంటే ముందే దొరసాని మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఇద్దరూ ఇండస్ట్రీలో రాణిస్తుండటంతో తల్లి హృదయం ఉప్పొంగిపోతోంది.

సొంత నిర్ణయాలు..
నేడు (మే 12న) మదర్స్ డే సందర్భంగా జీవిత రాజశేఖర్ కొన్ని ముచ్చట్లను మీడియాతో పంచుకుంది. నా పిల్లలిద్దరూ శక్తివంతమైన మహిళలుగా ఎదుగుతుంటే సంతోషంగా ఉంది. మొదట్లో నేను సూచనలు, సలహాలు ఇచ్చేదాన్ని. తర్వాత వారే సొంత నిర్ణయాలతో తమ జీవితాన్ని దిశానిర్దేశం చేసుకుంటున్నారు. ఎంత ఎదిగినా వారికేదైనా అవసరమైతే సాయం చేసేందుకు నేను ఎప్పటికీ ముందుంటాను.

పిల్లలపైనే ఆధారపడుతున్నాం..
ఇప్పుడు పిల్లలే నాకు చాలా విషయాల్లో సాయపడుతున్నారు. ఇన్‌స్టాగ్రామ్ వంటి లేటెస్ట్ టెక్నాలజీల గురించి వాళ్లే నాకు అన్నీ నేర్పిస్తారు. ఏదైనా డౌట్ వచ్చినా ఎంతో ఓపికగా అలా కాదమ్మా.. అంటూ అర్థమయ్యేలా వివరిస్తారు. ఇలాంటి విషయాల్లో రాజశేఖర్- నేను పిల్లలపైనే ఆధారపడతాము.
తల్లిగా ఆరా తీస్తా
ఎప్పుడైనా వాళ్లు కోపంగా, చిరాకుగా ప్రవర్తించినా ఒక తల్లిగా అసలేమైందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాను. వారు ఎలాంటి చికాకులు లేకుండా ఆనందంగా ఉండాలనే చూస్తాను. పిల్లల సంతోషమే నాక్కావాల్సింది.. అంతకు మించి ఏమీ వద్దు అని చెప్పుకొచ్చింది.
చదవండి: నీలి రంగు చీరలో టిల్లు స్క్వేర్ బ్యూటీ.. సారీ ధరెంతో తెలుసా?
Comments
Please login to add a commentAdd a comment