జీవితా రాజశేఖర్ కూతురిగా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది శివాత్మిక. మొదటి సినిమా దొరసానితో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న శివాత్మిక చాలా గ్యాప్ తర్వాత తెలుగులో మళ్లీ నటిస్తున్న సినిమా పంచతంత్రం. హర్ష పులిపాక దర్శకత్వం వహించిన ఈ సినిమా డిసెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో జీవితా రాజశేఖర్ స్పెషల్ గెస్టుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. ''చిన్నప్పటి నుంచి నా ఇద్దరు పిల్లలు సినిమా వాతావరణంలోనే పెరిగారు. వాళ్లు ఓరోజు మేం కూడా ఇండస్ట్రీలోకి వస్తాం అని చెప్పగానే నాకు, రాజశేఖర్ గారికి మామూలు టెన్షన్ రాలేదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్లకి ఏం కావాలన్నా ఆస్తులు అమ్మి మరీ కొనిచ్చాం. కానీ సినిమాలోకి రావడం అంత ఈజీ కాదు.
మంచి పాత్రలు దొరకడం, ఫేమ్ రావడం, రాకపోవడం అన్నది డెస్టినీ మీద ఆధారపడి ఉంటుంది. ఇది డబ్బుతో కొనలేం. అందుకే మా అమ్మాయిల విషయంలో చాలా టెన్షన్ పడ్డాం. కానీ వాళ్ల ఇష్టాన్ని గౌరవించి సపోర్ట్ చేస్తున్నాం'' అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం జీవితా రాజశేఖర్ చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.
Comments
Please login to add a commentAdd a comment