Panchathantram Movie
-
నా కూతుళ్లు ఆ రంగంలోకి వెళ్తామంటే చాలా టెన్షన్ పడ్డాం : జీవితా రాజశేఖర్
జీవితా రాజశేఖర్ కూతురిగా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది శివాత్మిక. మొదటి సినిమా దొరసానితో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న శివాత్మిక చాలా గ్యాప్ తర్వాత తెలుగులో మళ్లీ నటిస్తున్న సినిమా పంచతంత్రం. హర్ష పులిపాక దర్శకత్వం వహించిన ఈ సినిమా డిసెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో జీవితా రాజశేఖర్ స్పెషల్ గెస్టుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. ''చిన్నప్పటి నుంచి నా ఇద్దరు పిల్లలు సినిమా వాతావరణంలోనే పెరిగారు. వాళ్లు ఓరోజు మేం కూడా ఇండస్ట్రీలోకి వస్తాం అని చెప్పగానే నాకు, రాజశేఖర్ గారికి మామూలు టెన్షన్ రాలేదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్లకి ఏం కావాలన్నా ఆస్తులు అమ్మి మరీ కొనిచ్చాం. కానీ సినిమాలోకి రావడం అంత ఈజీ కాదు. మంచి పాత్రలు దొరకడం, ఫేమ్ రావడం, రాకపోవడం అన్నది డెస్టినీ మీద ఆధారపడి ఉంటుంది. ఇది డబ్బుతో కొనలేం. అందుకే మా అమ్మాయిల విషయంలో చాలా టెన్షన్ పడ్డాం. కానీ వాళ్ల ఇష్టాన్ని గౌరవించి సపోర్ట్ చేస్తున్నాం'' అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం జీవితా రాజశేఖర్ చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. -
‘పంచత్రంతం’ మూవీ రివ్యూ
టైటిల్: పంచతంత్రం నటీనటులు: బ్రహ్మానందం, సముద్రఖని, స్వాతి, నరేశ్ ఆగస్త్య,శివాత్మిక రాజశేఖర్, ఉత్తేజ్ తదితరులు నిర్మాణ సంస్థలు:టికెట్ ఫ్యాక్టరీ, ఒరిజినల్స్ నిర్మాతలు: అఖిలేష్ వర్ధన్, సృజన్ ఎరబోలు కథ, స్క్రీన్‌ప్లే: దర్శకత్వం: హర్ష పులిపాక సంగీతం:ప్రశాంత్ ఆర్ విహారి సినిమాటోగ్రఫీ: రాజ్ నల్లి ఎడిటర్:గ్యారీ బి హెచ్ విడుదల తేది: డిసెంబర్ 9 , 202 బాల్యంలో మనం పంచతంత్ర కథలు పుస్తకం చదువుకుని... వాటి నుంచి ఎంతో కొంత నీతిని నేర్చుకున్నాం. అలాంటి కథల ఇన్సిపిరేషన్ తో తెరకెక్కిన యాంథాలజీ చిత్రం ‘పంచతంత్రం’. టికెట్ ఫ్యాక్టరీ, ఒరిజినల్స్ పతాకాలపై అఖిలేష్ వర్దన్, సృజన్ ఎరబోలు నిర్మిస్తోన్న ఈ చిత్రానికి హర్ష పులిపాక దర్శకత్వం వహిస్తున్నారు. డిసెంబర్ 9న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం. కథ..కథనం ఆల్ ఇండియా రేడియోలో పనిచేసి రిటైర్డ్ అయిన వేదవ్యాసమూర్తి(బ్రహ్మానందం)రైటర్‌గా ఎదగాలనుకుంటాడు. కానీ అతని కూతురు డాక్టర్ రోషిణి(స్వాతి)మాత్రం వయసును గుర్తు చేస్తూ తండ్రిని నిరుత్సాపరుస్తుంది. ఇప్పటి యువతను కథలతో మెప్పించడం సాధ్యం కాదంటూ తండ్రిని ఎగతాళి చేస్తుంది. అయితే వ్యాస్ మాత్రం కూతురి మాటలు పట్టించుకోకుండా స్టోరీ టెల్లింగ్ కాంపిటీషన్‌కు వెళతాడు. అక్కడ ఐదు కథలు చెబుతాడు.దానికి పంచేంద్రియాలు అని పేరు పెడతాడు. దృశ్యం, రుచి, స్పర్శ, వాసన, వినికిడి అంశాల ఆధారంగా ఈ ఐదు కథలు సాగుతాయి. ఇందులో మొదటి కథ సాగర తీరాన్ని(బీచ్) చూడాలనుకునే ఓ యువ సాఫ్ట్వేర్ ఇంజనీర్ది. ఇందులో నరేశ్ అగస్త్య, శ్రీవిద్య మహర్షి ప్రధాన పాత్రలు పోషించారు. విహారి(నరేష్ అగస్త్య) సాఫ్ట్ వెర్ ఎంప్లాయ్ గా పని చేస్తూ స్నేహితులతో సరదాగా గడుపుతాడు.అతని ఒక్కసారి కూడా బీచ్‌కి వెళ్లలేదు. స్నేహితుల మాటల్లో సాగరతీరం ఎలా ఉంటుందో విని.. ఒక్కసారైనా బీచ్‌ని చూడాలని తపన పడతాడు. మరి తన కోరిక ఎలా నేరవేరిందనేదే మిగతా స్టోరీ. ఇది కాస్త నెమ్మదిగా, చప్పగా సాగుతుంది. ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ కాదు. రెండోది చిన్నప్పుడు ఇష్టపడిన అమ్మాయి జ్ఞాపకాలను తడిమి చూడాలనుకునే ఓ యువకుడిది. ఈ స్టోరీ లో శివాత్మిక రాజశేఖర్, రాహుల్ విజయ్ ప్రధాన పాత్రలు పోషించారు. సుభాష్(రాహుల్ విజయ్)కి ఇంట్లో సంబంధాలు చూస్తుంటారు. అయితే ఏ అమ్మాయి అతనికి నచ్చదు.చివరకు తల్లి కోసం లేఖ(శివాత్మిక)తో పెళ్లికి ఓకే చెబుతాడు. పెళ్లికి ముందు వాళ్లిద్దరు కలిసి మాట్లాడుకునే క్రమంలో ఇష్టమైన ప్రదేశం..చిన్నప్పటి లవ్‌స్టోరీని షేర్ చేసుకుంటారు. . ఒక అమ్మాయి లేదా అబ్బాయి పెళ్ళికి ఓకే చేసినప్పుడు అది పర్ఫెక్ట్ మ్యాచ్ అని ఎలా చెప్పగలం? అసలు ఒక అమ్మాయి, అబ్బాయికి ఉండాలిసింది ఏంటి? అనేది ఈ ఎపిసోడ్ లో బ్యూటిఫుల్ గా చూపించారు. ఇక మూడోది మానసిక రోగానికి గురైన ఓ రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్‌ది. రామనాథం(సముద్ర ఖని) ఉద్యోగవిరమణ చేసి ఇంట్లో ఖాళీగా ఉంటాడు. మరో పక్షం రోజుల్లో కూతురికి డెలివరీ ఉందనగా..అతనికి ఓ వింతవ్యాధి సోకుతుంది. చుట్టూ ఉన్న పరిసరాలు శుభ్రంగా ఉన్నప్పటికీ అతనికి మాత్రం బ్యాడ్ స్మెల్ వస్తుంటుంది.తన ప్రవర్తనతో కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురిచేస్తాడు.అసలు అతనికి మాత్రమే చెడు వాసన ఎందుకు వస్తుంది? ఆ అరుదైన మానసిక వ్యాధి అతనికి ఎలా సోకింది? చివరకు ఆ వ్యాధి నుంచి రామనాథం ఎలా భయటపడ్డాడు అనేదే మిగతా కథ. ఇందులో సముద్రఖని తనదైన నటనతో అదరగొట్టేశాడు. నాలుగో కథ మధ్యతరగతి కుటుంబానికి చెందిన దంపతులది. కొత్తగా పెళ్లైన దంపతులకు ఊహించని కష్టం వస్తుంది. ఆ సమయంలో వీరిద్దరు ఒకరికొకరు ఎలా తోడుగా నిలిచారనేదే ఈ కథ సారాంశం. ప్రాణాలు పోయినా సరే విడిపోకుండా కలిసి ఉండే ఓ అనోన్యమైన యవజంట కథ ఇది. కష్టం వచ్చినప్పుడు తుంచుకోడం కాదు...పంచుకోవాలి అనే సందేశాన్ని ఇచ్చే ఈ కథకి ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతుంది.ఈ స్టోరీ లో దివ్య శ్రీపాద, వికాస్ ఇద్దరు అన్యోన్య దంపతులు గా చక్కగా నటించారు. ఇక ఈ యాంథాలజీలో చివరిది 5వ కథ చాలా స్పూర్తిదాయకమైనది.ఇందులో స్వాతి ప్రధాన పాత్ర పోషించింది. లియా( స్వాతి) ఒక ఎంట్రప్రినర్. ప్రతి రోజు పాడ్ కాస్టింగ్ లో లియా స్టోరీస్ చెప్తుంటుంది. ఆ పాడ్ కాస్ట్ విని లియా ని ఎంతగానో అభిమానించే చిన్నారులు ఉంటారు. ఆ క్రమంలో పాడ్ కాస్టింగ్ ప్రోగ్రామ్ ఎండ్ చేసి, నెస్ట్ లెవెల్ కి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. కానీ, రూపా అనే చిన్నారి వల్ల, ఆ పాడ్ కాస్టింగ్ కి మరింత వెయ్యి రేట్లు ప్రాణం పోస్తుంది. అసలు ఆ చిన్నారి ఎవరు? ఏం చేసింది? ఆ పాప ప్రాముఖ్యత ఏంటి? అనేదే మిగతా స్టోరీ. ఇది చాలా ఎమోషనల్‌గా సాగుతుంది.క్లైమాక్స్ హర్ట్‌ని టచ్ చేస్తుంది. మొత్తంగా ఈ ఐదు కథలుగా తెరకెక్కిన ఈ ‘పంచతంత్రం’.. మంచి సందేశాన్ని ఇచ్చింది. ఒక్కో కథలో ఓక్కో నీతి ఉంది. దర్శకుడు ఎంచుకున్న కథలు... వాటిని నడిపించడానికి రాసుకున్న స్క్రీన్ ప్లే బాగున్నాయి. కాకపోతే కొన్ని ఎపిసోడ్స్‌లో అక్కడక్కడ సాగదీత గా అనిపిస్తుంది. ‘కెరియర్ అంటే 20ల్లోనే కాదు 60ల్లోనూ మొదలు పెట్టొచ చ్చు’, ‘కష్టం వచ్చినప్పుడు తుంచుకోడం కాదు...పంచుకోవాలి’, 'వదులుకోవడం ఎంత సేపు? క్షణం పట్టదు' లాంటి డైలాగ్స్ హృదయాలు హత్తుకుంటాయి. బ్రహ్మానందం అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. ప్రశాంత్ విహారి పాటలు, నేపథ్య సంగీతం బాగుంది. సినిమాటోగ్రాఫర్, ఎడిటర్ పనితీరు పర్వాలేదు. ఇలాంటి చిత్రాలను నిర్మించాలంటే అభిరుచి ఉండాలి. కమర్షియల్ లెక్కలు వేసుకోకుండా అఖిలేష్ వర్ధన్, సృజన్ ఎరబోలు ఈ సినిమాను రిచ్‌గా తెరకెక్కించారు. ఎలాంటి అశ్లీలత, ద్వందార్థాలకు చోటులేకుండా తెరకెక్కిన ఈ ‘పంచతంత్రం’ ప్రేక్షకులకు ఓ ప్రత్యేక అనుభూతిని కలిగిస్తాయి. - అంజిశెట్టి, సాక్షి వెబ్‌డెస్క్ -
ద్యావుడా.. ఒకే రోజు 17 సినిమాలు...ఎందుకిలా?
ఒకే వారంలో నాలుగైదు చిన్న సినిమాలు రిలీజ్ అవ్వడం టాలీవుడ్‌కి కొత్తేమి కాదు. ఒక్కోసారి 7-8 సినిమాలు కూడా రిలీజ్ అయిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఈ వారంతం ఒకటి కాదు రెండు కాదు.. ఒకేసారి 17 సినిమాలు బాక్సాఫీస్ బరిలోకి దిగబోతున్నాయి. టాలీవుడ్లో ఇదో రికార్డు అని చెప్పొచ్చు. సాధారణంగా పండుగ సీజన్స్‌లో పెద్ద సినిమాలు ఎక్కువగా విడుదలవుతాయి కాబట్టి చిన్న చిత్రాలు వెనక్కి తగ్గి.. పోటీలేని టైమ్‌లో ప్రేక్షకుల ముందుకు వస్తుంటాయి. ఈ క్రమంలో చిన్న చిత్రాల మధ్య బాక్సాఫీస్ వార్ మొదలవుతుంది. ‘తగ్గేదే లే’ అన్నట్లుగా ఒకేసారి ఐదారు బరిలోకి దిగుతాయి. కొంచెం పాజిటివ్ టాక్ వచ్చినా చాలు సేఫ్ జోన్లోకి వెళ్లిపోతాయి. కానీ నెగెటివ్ టాక్ వస్తే.. మరుసటి రోజే థియేటర్స్ నుంచి బయటకు వెళ్లాల్సిందే. అందుకే పోటీగా ఎక్కువ చిత్రాలు ఉన్నా.. విడుదలకు వెనక్కి తగ్గరు చిన్న నిర్మాతలు. (చదవండి: ఈ వారం ఓటీటీ, థియేటర్లలో సందడి చేయనున్న సినిమాలు ఇవే..!) అయితే ఈ వారం మాత్రం బాక్సాఫీస్ పోరు మాములుగా లేదు. ఈ ఏడాది చివరి మాసం కావడం.. సంక్రాంతి బరిలో వరుసగా పెద్ద చిత్రాలు ఉండడంతో.. డిసెంబర్ 9న ఏకంగా 17 చిన్న చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. ఎన్ని థియేటర్స్ దొరికాయి.. ఎక్కడెక్కడ దొరకలేదు అనే విషయాన్ని పట్టించుకోకుండా.. మన సినిమా విడుదలైతే చాలు..అదే పదివేలు అన్నట్లుగా చిన్న నిర్మాతలు వ్యవహరిస్తున్నారు. ఈ శుక్రవారం విడుదలయ్యే సినిమాల జాబితాలో గుర్తుందా శీతాకాలం, పంచతంత్రం, ముఖచిత్రం, ప్రేమదేశం, చెప్పాలని ఉంది, లెహరాయి, నమస్తే సేట్జీ, ప్రేమదేశం(ఈ ఓల్డ్ చిత్రం మళ్లీ థియేటర్స్‌లో విడుదలవుతుంది), రాజయోగం, డేంజరస్, విజయానంద్, ఏపీ 04 రామపురం, ఐ లవ్ యు ఇడియట్, మనం అందరం ఒక్కటే, ఆక్రోశం, ఏయ్ బుజ్జి నీకు నేనే, సివిల్ ఇంజనీర్ చిత్రాలు ఉన్నాయి. వీటిలో గుర్తుందా శీతాకాలం, పంచతంత్రం, డేంజరస్తో పాటు మరో రెండు, మూడు చిత్రాలు మాత్రమే ప్రచారం ప్రారంభించాయి. మిగతా చిత్రాలన్ని కేవలం పోస్టర్, ట్రైలర్ విడుదల చేసి నేరుగా థియేటర్స్‌లోకి వస్తున్నాయి. మరి వీటిలో ఏ సినిమాలు ప్రేక్షకులను మెప్పించి విజయం సాధిస్తాయో చూడాలి. -
ఆకట్టుకుంటున్న బ్రహ్మానందం ‘పంచ తంత్రం’ ట్రైలర్
బ్రహ్మానందం, కలర్స్ స్వాతి, సముద్రఖని, శివాత్మిక రాజశేఖర్, రాహుల్ విజయ్, నరేష్ అగస్త్య, దివ్య శ్రీపాద ప్రధాన పాత్రలలో నటిస్తున్న యాంథాలజీ ‘పంచతంత్రం’. హర్ష పులిపాక దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని టికెట్ ఫ్యాక్టరీ, ఎస్ ఒరిజినల్స్ బ్యానర్స్‌పై అఖిలేష్ వర్ధన్, సృజన్ ఎరబోలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ని స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న విడుదల చేసిన చిత్ర యూనిట్‌కి అభినందనలు తెలియజేసింది. ‘పంచతంత్రం’ ట్రైలర్‌ను గమనిస్తే.. ఇది 5 జంటలకు సంబంధించిన కథ అని అర్థమవుతుంది. డా.బ్రహ్మానందం ఈ ఐదు కథలకు పంచేద్రియాలు అనే పేరు పెట్టి తన కోణంలో స్టార్ట్ చేస్తారని ట్రైలర్‌ను చూస్తే అర్థమవుతుంది. జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఉంటాయి. సంతోషాలే కాదు.. బాధలు కూడా వస్తుంటాయి. అలా వచ్చినప్పుడు మనం వాటిని ఎలా స్వీకరించాం. మన పనులను ఎంత బాధ్యతగా పూర్తి చేస్తూ ముందుకెళ్లామనేది కథాంశం అని క్లియర్‌గా తెలుస్తుంది. సినిమాలో మనకు కనిపించబోయే ఐదు జంటలకు ఒక్కో కథ .. ఒక్కో రకమైన ప్రయాణం.. అవన్నీ ఎలాంటి ముగింపుతో ఎండ్ అయ్యాయనే ‘పంచతంత్రం’ సినిమా ఫీల్ గుడ్ ఎంటర్టైనర్గా హార్ట్ టచింగ్ ఎమోషన్స్‌తో ముందుకు సాగుతుంది. ప్రతి కథలో మన చుట్టూ ఉన్న సమాజాన్ని అందులో వ్యక్తుల వ్యక్తిత్వాలను దర్శకుడు హర్ష ఎంతో అర్థవంతంగా ముందుకు తీసుకెళ్లిన్నట్లు తెలుస్తోంది. అర్థవంతమైన సంభాషణలు ప్రతి పాత్రలోని భావోద్వేగాలను సెన్సిబుల్‌గా ఎలివేట్ చేస్తున్నాయి. డిసెంబర్9న ఈ చిత్రం విడుదల కాబోతంది. -
బ్రహ్మానందం ‘పంచతంత్రం’ రిలీజ్ డేట్ ఫిక్స్
బ్రహ్మానందం, కలర్స్ స్వాతి, సముద్రఖని, శివాత్మిక రాజశేఖర్, రాహుల్ విజయ్, నరేష్ అగస్త్య, దివ్య శ్రీపాద ప్రధాన పాత్రలలో నటిస్తున్న చిత్రం ‘పంచతంత్రం’. హర్ష పులిపాక దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని టికెట్ ఫ్యాక్టరీ, ఎస్ ఒరిజినల్స్ బ్యానర్స్‌పై అఖిలేష్ వర్ధన్, సృజన్ ఎరబోలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం విడుదల తేదిని ప్రకటించారు మేకర్స్. డిసెంబర్ 9న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు వెల్లడిస్తూ.. ఓ వీడియోని వదిలారు. ఆ వీడియోలో బ్రహ్మానందం కాస్త సీరియస్ గా, వ్యామోహంతో 'పంచతంత్రం' అనే పదం రాసి ఉన్న క్యాసెట్ ని చూస్తున్నాడు. తర్వాత రాహుల్ విజయ్ కాస్త ఆత్రుతగా, గాలిలోకి చూస్తూ నడవడం మనం చూస్తాం. హ్యాపీ మూడ్‌లో ఉన్న శివాత్మిక రాజశేఖర్‌ని అతనికి జోడీగా చూపించారు. సముద్రఖని మరియు దివ్య వాణి మధ్య వయస్కులైన జంటగా కనిపిస్తున్నారు. దివ్య శ్రీపాద తన భర్తతో కలిసి ఆనందకరమైన భావోద్వేగ మూడ్‌లో ఉన్న దృశ్యాలు ఉన్నాయి. సాగాగా అభివర్ణిస్తున్న ఈ చిత్రంలో 'కలర్స్' స్వాతి కీలక పాత్రలో నటిస్తోంది. ఆమె మరోసారి 'పంచతంత్రం' క్యాసెట్‌తో వృత్తాన్ని పూర్తి చేస్తోంది. మరి ఈ పంచత్రంతం కథేంటో తెలియాలంటే డిసెంబర్ 9వరకు ఆగాల్సిందే. సినిమా విడుదల తేది ప్రకటన సందర్భంగా నిర్మాతలు సృజన్ ఎరబోలు, అఖిలేష్ వర్ధన్ మాట్లాడుతూ.. ఇప్పటి వరకు విడుదలైన ప్రచార చిత్రాలు, పాటలకు మంచి స్పందన లభించింది. ఈ చిత్రంలో బ్రహ్మానందం ‘వేదవ్యాస్’ పాత్ర పోషించారు. ఆయనతో పాటు మిగిలిన నటీనటులు కూడా చక్కగా నటించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని డిసెంబర్ 9న రాబోతున్న మా చిత్రాన్ని ఆదరించాలని ప్రేక్షకులను కోరుకుంటున్నాం’అన్నారు. ‘బ్రహ్మానందం, స్వాతిరెడ్డి మధ్య సన్నివేశాలు ఎంతో హృద్యంగా ఉంటాయి. వీరి పాత్రలు ప్రేక్షకుల హృదయాల్లో బలమైన ముద్ర వేస్తాయి. ఇందులో నటించిన వారంతా చాలా చక్కటి నటనను కనబరిచారు. అన్ని వర్గాల వారికి నచ్చేవిధంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం’అని దర్శకుడు హర్ష పులిపాక అన్నారు. -
Panchathantram: ఏ రాగమో..నన్నే.. రమ్మని పిలుస్తున్నదే..
బ్రహ్మానందం, సముద్రఖని, స్వాతిరెడ్డి, శివాత్మిక రాజశేఖర్, యువ హీరో రాహుల్ విజయ్, ‘మత్తు వదలరా’ ఫేమ్ నరేష్ అగస్త్య ప్రధాన తారాగణంగా రూపొందుతున్న చిత్రం ‘పంచతంత్రం’.టికెట్ ఫ్యాక్టరీ, ఎస్ ఒరిజినల్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. హర్ష పులిపాక దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రానికి అఖిలేష్ వర్ధన్, సృజన్ ఎరబోలు నిర్మాతలు. ఈ చిత్రం నుంచి ఇటీవల విడుదలైన ఫస్ట్ గ్లింప్స్, పోస్టర్లకు మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ మూవీ నుంచి లిరికల్ సాంగ్‌ని విడుదల చేశారు. ‘ఏ.. రాగమో..నన్నే.. రమ్మని పిలుస్తున్నదే…ఏ వేగమో.. గతాన్నే స్వా..గతించే పదంలో.. సా..గుతుంటే తమాషా..’అంటూ సాగే ఈ పాటకుప్రశాంత్ ఆర్. విహారి, శ్రవణ్ భరద్వాజ్‌లు సంగీతం అందించగా, రవి, ప్రశాంత్ ఆర్. విహారి, లక్మీ మేఘన,శ్రీ కావ్య అద్భుతంగా ఆలపించారు. సాంగ్ విడుదల సందర్భంగా నిర్మాతలు సృజన్ ఎరబోలు, అఖిలేష్ వర్ధన్ మాట్లాడుతూ.. "ఆల్రెడీ విడుదల చేసిన ప్రచార చిత్రాలు,ఫస్ట్ గ్లింప్స్‌కు ప్రేక్షకుల నుండి పెంటాస్టిక్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు వస్తున్న ఏ రాగమో సాంగ్ కూడా అదే స్థాయిలో అలరిస్తుందనే నమ్మకం ఉంది.బ్రహ్మానందం గారు ఎన్నో పాత్రల్లో నటించి ప్రేక్షకులను నవ్వించారు. అలాగే ఆయనలో అద్భుతమైన నటుడు ఉన్నారు. వెయ్యి చిత్రాలకు పైగా చేసిన బ్రహ్మానందం గారు మా సినిమాలో వేదవ్యాస్ గా ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నందుకు మా అదృష్టంగా భావిస్తున్నాం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్నాయి. త్వరలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం" అని అన్నారు.