బ్రహ్మానందం ‘పంచతంత్రం’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ | Panchathantram Movie Release Date Out | Sakshi
Sakshi News home page

Panchathantram: బ్రహ్మానందం ‘పంచతంత్రం’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

Published Sun, Oct 9 2022 11:56 AM | Last Updated on Sun, Oct 9 2022 11:56 AM

Panchathantram Movie Release Date Out - Sakshi

బ్ర‌హ్మానందం, కలర్స్ స్వాతి, స‌ముద్ర‌ఖ‌ని, శివాత్మిక రాజ‌శేఖ‌ర్, రాహుల్ విజ‌య్, నరేష్‌ అగస్త్య, దివ్య శ్రీపాద  ప్ర‌ధాన పాత్ర‌ల‌లో న‌టిస్తున్న చిత్రం ‘పంచతంత్రం’. హర్ష పులిపాక దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని  టికెట్‌ ఫ్యాక్టరీ, ఎస్‌ ఒరిజినల్స్‌ బ్యానర్స్‌పై అఖిలేష్‌ వర్ధన్‌, సృజన్‌ ఎరబోలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం విడుదల తేదిని ప్రకటించారు మేకర్స్‌.

డిసెంబర్‌ 9న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు వెల్లడిస్తూ.. ఓ వీడియోని వదిలారు.  ఆ వీడియోలో బ్రహ్మానందం కాస్త సీరియస్ గా, వ్యామోహంతో  'పంచతంత్రం' అనే పదం రాసి ఉన్న క్యాసెట్ ని చూస్తున్నాడు.  తర్వాత రాహుల్ విజయ్ కాస్త ఆత్రుతగా, గాలిలోకి చూస్తూ నడవడం మనం చూస్తాం. హ్యాపీ మూడ్‌లో ఉన్న శివాత్మిక రాజశేఖర్‌ని అతనికి జోడీగా చూపించారు. సముద్రఖని మరియు దివ్య వాణి మధ్య వయస్కులైన జంటగా కనిపిస్తున్నారు.  దివ్య శ్రీపాద తన భర్తతో కలిసి ఆనందకరమైన భావోద్వేగ మూడ్‌లో ఉన్న దృశ్యాలు  ఉన్నాయి. సాగాగా అభివర్ణిస్తున్న ఈ చిత్రంలో 'కలర్స్' స్వాతి కీలక పాత్రలో నటిస్తోంది.  ఆమె మరోసారి 'పంచతంత్రం' క్యాసెట్‌తో వృత్తాన్ని పూర్తి చేస్తోంది.  మరి ఈ పంచత్రంతం కథేంటో తెలియాలంటే డిసెంబర్‌ 9వరకు ఆగాల్సిందే. 

సినిమా విడుదల తేది ప్రకటన సందర్భంగా నిర్మాతలు  సృజన్‌ ఎరబోలు, అఖిలేష్ వర్ధన్ మాట్లాడుతూ.. ఇప్పటి వరకు విడుదలైన ప్రచార చిత్రాలు, పాటలకు మంచి స్పందన లభించింది. ఈ చిత్రంలో బ్రహ్మానందం ‘వేదవ్యాస్‌’ పాత్ర పోషించారు. ఆయనతో పాటు మిగిలిన నటీనటులు కూడా చక్కగా నటించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని డిసెంబర్‌ 9న రాబోతున్న మా చిత్రాన్ని ఆదరించాలని ప్రేక్షకులను కోరుకుంటున్నాం’అన్నారు. 

‘బ్రహ్మానందం, స్వాతిరెడ్డి మధ్య సన్నివేశాలు ఎంతో హృద్యంగా ఉంటాయి. వీరి పాత్రలు ప్రేక్షకుల హృదయాల్లో బలమైన ముద్ర వేస్తాయి. ఇందులో నటించిన వారంతా  చాలా చక్కటి నటనను కనబరిచారు. అన్ని వర్గాల వారికి నచ్చేవిధంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం’అని దర్శకుడు హర్ష పులిపాక అన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement