
బ్రహ్మానందం, కలర్స్ స్వాతి, సముద్రఖని, శివాత్మిక రాజశేఖర్, రాహుల్ విజయ్, నరేష్ అగస్త్య, దివ్య శ్రీపాద ప్రధాన పాత్రలలో నటిస్తున్న యాంథాలజీ ‘పంచతంత్రం’. హర్ష పులిపాక దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని టికెట్ ఫ్యాక్టరీ, ఎస్ ఒరిజినల్స్ బ్యానర్స్‌పై అఖిలేష్ వర్ధన్, సృజన్ ఎరబోలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ని స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న విడుదల చేసిన చిత్ర యూనిట్‌కి అభినందనలు తెలియజేసింది.
‘పంచతంత్రం’ ట్రైలర్‌ను గమనిస్తే.. ఇది 5 జంటలకు సంబంధించిన కథ అని అర్థమవుతుంది. డా.బ్రహ్మానందం ఈ ఐదు కథలకు పంచేద్రియాలు అనే పేరు పెట్టి తన కోణంలో స్టార్ట్ చేస్తారని ట్రైలర్‌ను చూస్తే అర్థమవుతుంది. జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఉంటాయి. సంతోషాలే కాదు.. బాధలు కూడా వస్తుంటాయి. అలా వచ్చినప్పుడు మనం వాటిని ఎలా స్వీకరించాం. మన పనులను ఎంత బాధ్యతగా పూర్తి చేస్తూ ముందుకెళ్లామనేది కథాంశం అని క్లియర్‌గా తెలుస్తుంది. సినిమాలో మనకు కనిపించబోయే ఐదు జంటలకు ఒక్కో కథ .. ఒక్కో రకమైన ప్రయాణం.. అవన్నీ ఎలాంటి ముగింపుతో ఎండ్ అయ్యాయనే ‘పంచతంత్రం’ సినిమా ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్‌గా హార్ట్ టచింగ్ ఎమోషన్స్‌తో ముందుకు సాగుతుంది.
ప్రతి కథలో మన చుట్టూ ఉన్న సమాజాన్ని అందులో వ్యక్తుల వ్యక్తిత్వాలను దర్శకుడు హర్ష ఎంతో అర్థవంతంగా ముందుకు తీసుకెళ్లిన్నట్లు తెలుస్తోంది. అర్థవంతమైన సంభాషణలు ప్రతి పాత్రలోని భావోద్వేగాలను సెన్సిబుల్‌గా ఎలివేట్ చేస్తున్నాయి. డిసెంబర్9న ఈ చిత్రం విడుదల కాబోతంది.
Comments
Please login to add a commentAdd a comment