Panchathantram: ఏ రాగమో..నన్నే.. రమ్మని పిలుస్తున్నదే.. | Ye Ragamo Song Out From Panchathantram | Sakshi

Panchathantram: ఏ రాగమో..నన్నే.. రమ్మని పిలుస్తున్నదే..

Mar 8 2022 8:10 AM | Updated on Mar 8 2022 8:10 AM

Ye Ragamo Song Out From Panchathantram - Sakshi

బ్రహ్మానందం, సముద్రఖని, స్వాతిరెడ్డి, శివాత్మిక రాజశేఖర్, యువ హీరో రాహుల్‌ విజయ్‌, ‘మత్తు వదలరా’ ఫేమ్‌ నరేష్‌ అగస్త్య ప్రధాన తారాగణంగా రూపొందుతున్న చిత్రం ‘పంచతంత్రం’.టికెట్‌ ఫ్యాక్టరీ, ఎస్‌ ఒరిజినల్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. హర్ష పులిపాక దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రానికి అఖిలేష్‌ వర్ధన్‌, సృజన్‌ ఎరబోలు నిర్మాతలు.  ఈ చిత్రం నుంచి ఇటీవల విడుదలైన ఫస్ట్‌ గ్లింప్స్‌, పోస్టర్లకు మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ మూవీ నుంచి లిరికల్‌ సాంగ్‌ని విడుదల చేశారు. 

‘ఏ.. రాగమో..నన్నే.. రమ్మని పిలుస్తున్నదే…ఏ వేగమో.. గతాన్నే స్వా..గతించే పదంలో.. సా..గుతుంటే తమాషా..’అంటూ సాగే ఈ పాటకుప్రశాంత్‌ ఆర్‌. విహారి, శ్రవణ్ భరద్వాజ్‌లు సంగీతం అందించగా,  రవి, ప్రశాంత్‌ ఆర్‌. విహారి, లక్మీ మేఘన,శ్రీ కావ్య అద్భుతంగా ఆలపించారు. 

సాంగ్‌ విడుదల సందర్భంగా నిర్మాతలు సృజన్‌ ఎరబోలు, అఖిలేష్ వర్ధన్ మాట్లాడుతూ.. "ఆల్రెడీ విడుదల చేసిన ప్రచార చిత్రాలు,ఫ‌స్ట్ గ్లింప్స్‌కు ప్రేక్షకుల నుండి పెంటాస్టిక్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు వస్తున్న ఏ రాగమో సాంగ్ కూడా అదే స్థాయిలో అలరిస్తుందనే నమ్మకం ఉంది.బ్రహ్మానందం గారు ఎన్నో పాత్రల్లో నటించి ప్రేక్షకులను నవ్వించారు. అలాగే  ఆయనలో అద్భుతమైన నటుడు ఉన్నారు. వెయ్యి చిత్రాలకు పైగా చేసిన బ్రహ్మానందం గారు మా సినిమాలో  వేదవ్యాస్ గా ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నందుకు మా అదృష్టంగా భావిస్తున్నాం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్నాయి. త్వరలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం" అని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement