‘‘శివానీ హీరోయిన్‌గా పరిచయం కావాల్సిన ‘2 స్టేట్స్’ సినిమా తెలుగు రీమేక్ ఆగిపోయింది. నేనే నిర్మాతగా శివానీతో ఓ సినిమా చేయాలనుకున్నాను. వీలుపడలేదు. కానీ ఇప్పుడు ‘అద్భుతం’ లాంటి మంచి సినిమాతో శివానీ హీరోయిన్‌గా పరిచయం అయింది. శివానీ నటనను మెచ్చుకుంటూ నాకు చాలా ఫోన్‌కాల్స్, మెసేజ్‌లు వచ్చాయి. ‘అద్భుతం’ సినిమాతో శివానీ, ‘దొరసాని’ చిత్రంతో శివాత్మిక మేం గర్వపడేలా చేసినందుకు సంతోషంగా ఉంది’’ అని రాజశేఖర్, జీవిత దంపతులు అన్నారు. తేజా సజ్జా, శివానీ రాజశేఖర్ హీరో హీరోయిన్లుగా మల్లిక్ రామ్ దర్శకత్వంలో చంద్రశేఖర్ నిర్మించిన చిత్రం ‘అద్భుతం’.
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సినిమాకు వీక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోందని చిత్రబృందం చెబుతోంది. ఈ సందర్భంగా విలేకర్ల సమావేశంలో జీవితా రాజశేఖర్ మాట్లాడుతూ– ‘‘సక్సెస్‌ను కొనలేం. కష్టపడి సాధించుకోవాలి. ‘అద్భుతం’లాంటి సినిమాతో శివానీకి సక్సెస్ రావడం హ్యాపీగా ఉంది’’ అన్నారు. ‘‘నేను హీరోయిన్‌గా అంగీకరించిన సినిమాలు ఏదో కారణం చేత ఆగిపోతూనే ఉన్నాయి. ‘అద్భుతం’ సినిమాతో నా కల నిజమైంది. నా తొలి సినిమా ఓటీటీలో విడుదలైనప్పటికీ వ్యూయర్స్ నుంచి మంచి స్పందన వస్తుండటం ఆనందంగా ఉంది’’ అన్నారు శివానీ. ఈ కార్యక్రమంలో శివాత్మిక, దర్శకుడు ప్రవీణ్ సత్తారు, లక్ష్మీభూపాల్, సృజన్‌లతో పాటు చిత్రబృందం పాల్గొంది.
Comments
Please login to add a commentAdd a comment