శివాని రాజశేఖర్.. సినీ జంట డాక్టర్ రాజశేఖర్, జీవితల తనయ. ఆ ఐడెంటిటీ కొంచెం ప్లస్ అయినా నటిగా నిలదొక్కుకోవడానికి మాత్రం అభినయాన్నే నమ్ముకుంది. చిన్న పాత్రా.. పెద్ద పాత్రా.. అని చూసుకోకుండా నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు పోషించడం ముఖ్యమని భావించింది. అనుసరిస్తోంది. స్టార్‌గా వెబ్ తెరను ఏలుతోంది. తండ్రి లాగే ఎమ్‌బీబీస్ పూర్తిచేసి యాక్టర్ అయిన డాక్టర్ శివాని.. చెల్లి శివాత్మిక కంటే కొంచెం లేట్‌గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. సినిమా ప్రపంచం గురించి పూర్తి అవగాహన ఉండటంతో మొదట నిర్మాతగా మారి తెలుగులో ‘ఎవడైతే నాకేంటి’, ‘సత్యమేవ జయతే’, ‘ కల్కి’ సినిమాలు నిర్మించింది.
మోడల్‌గానూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ‘ఫెమినా మిస్ ఇండియా 2022’ ఫైనలిస్ట్‌గా నిలిచింది. తర్వాత ‘అద్భుతం’సినిమాలో అద్భుతంగా నటించి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ‘టూ స్టేట్స్’, ‘డబ్యూడబ్ల్యూడబ్ల్యూ’ , ‘శేఖర్’ సినిమాలతో ఇటు తెలుగు ప్రేక్షకులను, ‘అన్బరివు’, ‘నెంజుక్కు నీతి’ సినిమాలతో అటు తమిళ ప్రేక్షకులనూ మెప్పించింది. తన సినిమాలు అన్నీ ఓటీటీలోనే విడుదలయినప్పటికీ వెండితెర ప్రేక్షకులకూ బాగా దగ్గరైంది. ప్రస్తుతం జీ5లో స్ట్రీమింగ్‌లో ఉన్న ‘ఆహ నా పెళ్లంట’ వెబ్ సిరీస్‌తో వినోదాన్ని పంచుతోంది.
చిన్నప్పుడు బొంగరాలు కొట్టేసేదాన్ని. ఇంటికి తెచ్చి ఎవరికీ తెలియకుండా వాటిని తిప్పుతూ తెగ ఆనందపడిపోయేదాన్ని. ఈ విషయం ఇప్పటిదాకా అమ్మనాన్నలకు తెలియదు. – శివాని రాజశేఖర్
Comments
Please login to add a commentAdd a comment