'గన్ ‍కన్నా.. ఫోన్ బాగా పేలుతుంది సార్' | Srikanth Lead Role Kota Bommali PS Teaser Released Today | Sakshi
Sakshi News home page

Kota Bommali PS: 'గన్ ‍కన్నా.. ఫోన్ బాగా పేలుతుంది సార్'.. ఆసక్తిగా టీజర్

Published Mon, Nov 6 2023 7:54 PM | Last Updated on Mon, Nov 6 2023 8:27 PM

Srikanth Lead Role Kota Bommali PS Teaser Released Today - Sakshi

శ్రీకాంత్‌, వరలక్ష్మి శరత్ కుమార్, రాహుల్‌ విజయ్‌, శివానీ రాజశేఖర్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన చిత్రం 'కోట బొమ్మాళి పి.ఎస్‌'. ఈ చిత్రానికి తేజ మార్ని దర్శకత్వం వహిస్తు‍న్నారు. ఈ  సినిమాను జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీ వాస్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 24న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ మూవీ టీజర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. 

(ఇది చదవండి: అందుకే ఆ హీరోను దూరం పెట్టేశా.. అనసూయ క్రేజీ కామెంట్స్!)

టీజర్ చూస్తే ఈ చిత్రం శ్రీకాకుళం జిల్లా బ్యాక్‌ డ్రాప్‌లో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. పోలీసులు, రాజకీయ నాయకుల మధ్య జరిగే సన్నివేశాలే కథాంశంగా తీసినట్లు కనిపిస్తోంది. సస్పెన్స్‌తో పాటు క్రైమ్‌ థ్రిల్లర్‌ను తలపించే యాక్షన్ సీన్స్ ఈ చిత్రంపై అంచనాలు పెంచేస్తున్నాయి. ‍అసలు ఈ కోట బొమ్మాళి పీఎస్ కథేంటో తెలియాలంటే ఈనెల 24 వరకు ఆగాల్సిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement